Lizard Astrology in Telugu : బల్లులను చూసి చాలమంది భయపడుతారు. కానీ హిందుశాస్త్రాల ప్రకారం బల్లులకు కూడా విశేష స్థానం ఉంది. మనపై బల్లులు పడటం కూడా రాబోయే మంచిని చెడుతు సూచిస్తాయని శాస్త్రాలు చెబుతుంటాయి. అయితే బల్లుల ఇళ్లలోని కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తే మంచిదేనట. అలాగే ఆలయంలో లేదా దేవుడి గుడిలో బల్లి కనిపిస్తే మంచిది. అది ధనం, సంతోషాన్ని సూచిస్తుందట. అంతేకాకుండా ఇంటిలోని వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలకు చిహ్నమట.
ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుందని చెబుతున్నారు పండితులు. భవిష్యత్ లో ఎదురయ్యే సంఘటనలను కూడా బల్లులు సూచిస్తాయని చెబతున్నారు. ఇంట్లో దీపావళి రోజు బల్లి కనిపిస్తే శుభ సూచకం. బల్లి లక్ష్మీదేవిని సూచిస్తుందని అంటుంటారు.
ఇక బల్లులు ఇంట్లో కొట్లాడుకుంటే ఏమవుతుంది? బల్లి చనిపోతే ఎదురయ్యే సంకేతాలేమిటనేవి ఇప్పుడు చూద్దాం..
Also Read: ఫ్రిజ్‌లో ఈ పదార్థాలు పెట్టకూడదు ఎందుకంటే..!?
కొత్తగా ఇంట్లోకి వచ్చేవారికి బల్లులు చనిపోయి కానీ.. పూడ్చిపెట్టిన బల్లి కానీ కనిపిస్తే అశుభమని నమ్ముతారు. బల్లులు పోట్లాడుకుంటే మంచిది కాదట. కలలో మీరు బల్లిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే .. అది పారిపోతే మంచిదని నమ్మకం. రెండు బల్లులు కొట్లాడుకుంటే చూడకూడదట. అలా చేస్తే అశుభాలు కలుగుతాయట. ఇంట్లో బల్లులు కొట్లాడుకుంటే.. ఆ ఇంట్లోని వ్యక్తుల మధ్య కూడా మనస్పర్థలు పెరుగుతాయని అంటున్నారు.