Mystery of Dharmapuri : ఆలయంలో ఉండే రాయి ఆ ఆలయంలో నుండి బయటికి తీస్తే.. పొలిమేర దాటేలోపు మళ్లీ వచ్చి ఆలయంలోనే ఉంటుంది. ఈ విషయం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది కదా.. నిజంగా అలాంటి రాయి ఉందా అని డౌట్ పడుతున్నారా.. కేరళ, తమిళనాడు బార్డర్లో ఉండే చిన్న గ్రామం ధర్మపురి. ఆ ఊరిలోని ఆలయంలో రాయికి చాలా చరిత్ర ఉంది.
ఆ రాయిని ఎవరైనా ఆలయంలో నుండి తీసుకొని ఆ ఊరి పోలిమేర దాటాలి అని చూస్తే మాత్రం ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.. షాకింగ్ గా ఉంది కదా..
ఆ ఊరిలో.. ఊరంతా ఒక దిక్కు ఉంటే,
‘మడగరప్ప స్వామి’ దేవాలయం ఒకవైపు ఉంటుంది. ఒకసారి ఆ ఊరికి పట్నం నుండి వచ్చిన ఒక వ్యాపారి ఆ రాయిని 5000 పందెం కట్టి ఎడ్ల బండిలో తీసుకొని వెళ్లే ప్రయత్నం చేయగా, తీసుకొని వెళ్తుంటే రెండు ఎద్దుల కొమ్ములు విరిగిపోయి, ఆ వ్యాపారి కూడా ఎడ్ల బండి మీద నుంచి కింద పడిపోయి రక్తం కక్కుకున్నాడంట., వెంటనే ఆ వ్యాపారి భయపడి అక్కనుండి పారిపోయాడంట.
ఆ రాయి మళ్ళీ వచ్చి ఎప్పటి స్థానంలో కూర్చుందట. అంతేకాదు ఆ రాయిని కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది చిన్న పిల్లలు ఆడుకుంటూ తెలియక రాయిని ఎత్తుకెళ్లి ఒక చెరువులో పడేస్తే ఆ చెరువులో చాలా దూరం కొట్టుకుపోయిన తర్వాత, తెల్లవారి వచ్చి గుడి తలుపులు తీసి చూసేసరికి ఆ రాయి మళ్లీ గుడిలో యథాస్థానంలో ఉందంట.
చాలామంది ఆ రాయిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ కొంతమందికి కాళ్లు, చేతులు పడిపోయి, కొంతమంది గుడ్డివాళ్లు అయిపోయి చాలా దారుణమైన స్థితిలోకి వెళ్లిపోయారంట. ఆ రాయిని ఎక్కడకు తీసుకుపోయి వదిలేసినా కూడా మళ్ళీ తెల్లవారేసరికి వచ్చి గుళ్లో ఉంటుందంట. కొంతమంది కలిసి ఆ రాయిని తీసుకెళ్లి ఒక గదిలో పెట్టి తాళం వేసారంట, మళ్లీ తెల్లవారేసరికి ఆ రాయి గర్భగుడిలో వచ్చి ఉందంట.
ఆ రాయికి ఎందుకంత ప్రత్యేకత..
పూర్వం ‘కరుప్పాయా’ అనే ఒక ఆయన ఉండేవాడు. అతను ఆ ఊరిని, ఆ ఊరి దేవతను కాపాడేవాడు. అనుకోకుండా ఓసారి ఊర్లో వర్షాలకు వరదలు వచ్చి చెరువులు ఆనకట్టలు తెగి ఊరు మునిగిపోతుంటే.. ఆ పరిస్థితుల్లో ఈ కరుప్పాయా ఆ ఊరిని కాపాడాడంట. ఆ కాపాడే ప్రయత్నంలో కరుప్పయ ప్రాణాలు వదిలేశాడు. ఆ ఊరిని కాపాడినందుకుగాను దేవుడు కరుప్పాయా త్యాగాన్ని మెచ్చుకొని,
ఏం వరం కావాలో కోరుకోమంటే కరుప్పాయా వెంటనే నేను ఎప్పటికీ మా ఊరి ప్రజలను వదిలి వెళ్ళకుండా మా ఊరిలోనే ఉండేటట్టు వరం ఇమ్మని అడిగాడట దేవుడు వెంటనే ఆ వరాన్ని ఇచ్చాడట. ఇక అప్పటినుంచి కరుప్పాయా ఆ ఊరిలోనే ఆ రాయిగా వెలిశాడని ఆ ఊరి గ్రామ పూజారి, ఆ ఊరి గ్రామ పెద్దలు చెప్తున్నారు. ఆ వింతను ఆ ఊరిలో జరిగిన విశేషాలను తెలుసుకోవాలంటే మీరు కూడా ఒకసారి ధర్మపురి గ్రామానికి వెళ్లి సందర్శించండి..
Discussion about this post