Shivalayam Opens once in a Year : ఏడాదికి ఒక్కసారే తెరుచుకునే శివాలయం.. ఏపీలో ఎక్కడంటే..???
సాధారణంగా ఆలయాలు ప్రతిరోజూ తెరుచుకుంటాయ్.. అప్పుడప్పుడు గ్రహణాలు అమావాస్య అని పాక్షికంగా ముసివేసినా.. మళ్ళీ ఆ తరువాత ఆలయం అంతా శుద్ధి చేసి భక్తుల సందర్శనార్ధం తిరిగి తెరవడం మనం సర్వ సాధారణం.. మనకి తెలిసిందే.
అయితే ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరుచుకునే ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..??
అదీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉందని తెలుసా..??
ఆ సంగతి తెలుసుకుందాం రండి
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామం లోని ఊలపల్లి రోడ్డులో దాదాపు 1100 ల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన శివాలయం ఉంది.
అయితే ఈ ఆలయం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తెరవబడుతుంది.. ఈ ఆలయంలో పరమ శివుడు శ్రీ శ్రీ శ్రీ కేదారేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు.
కేవలం శివరాత్రి రోజునే తెరవబడే ఈ ఆలయంలో ప్రతీ మహా శివరాత్రి పండుగ సందర్బంగా జరిగే మహోత్సవములు ఘనంగా జరుగుతాయి ..
అయితే ఈసారి కూడా వచ్చే శివరాత్రికి ఆ పరమ శివుడి పేరు మీద పూజలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.