SriRama Navami 2023 : ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది రామనామం. రామనామం చాలా రమ్యమైనది. ఈ యొక్క నామ జపం ఎన్నో బాధల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మరో అవతారమే శ్రీరాముడు. రాముడిని అందరూ ఆదర్శంగా చెప్పుకుంటారు. ఒక మనిషి భూమి మీద ఎలా ఉండాలి అనేది మనకు నేర్పించిన వ్యక్తి రాముడు. భగవంతుని వేయి నామాలను జపించడం ఒక్కసారి రామనామం జపించడంతో సమానం.
* శ్రీరామ జయ రామ్ జై జై రామ్..
ఈ మంత్రాన్ని జపించడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ జపం ఎన్నో క్లిష్టమైన సమస్యల నుండి మనల్ని రక్షిస్తుంది .మీకు అనారోగ్యం కానీ ఆర్థిక సమస్యలు కానీ ఉంటే ఈ నామం జపించడం వల్ల సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి.
* ఓం రామాయ హం ఫట్ స్వాహా..
ఇది శ్రీ రామునికి అంకితం చేయబడిన తాంత్రిక మంత్రం. మీరు ఏదైనా వ్యాజ్యంలో చిక్కుకుంటే ఈ మంత్రం మిమ్మల్ని రక్షిస్తుంది.
* ఓం రామభద్రాయ నమః..
మీరూ అనుకున్న పని జరగకపోయిన,మధ్యలో ఆగిపోయినా ఈ మంత్రం జపించడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు..
* ఓం రామచంద్రాయ నమః..
మీ అభివృద్ధి కి ఆటంకం కలుగుతుంది..మీరు చేస్తున్న పని పూర్తి కాదేమో అనే అనుమానం మీకు వస్తే..ఈ మంత్రాన్ని జపించండి.
* ఓం నమో భగవతే రామచంద్రాయ..
ఈ మంత్రం మీ జీవితంలో నుండి వినాశకరమైన సంఘటనలను తొలగిస్తుంది.
* శ్రీరామ జయం..
ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించడం లేదా రాయడం ద్వారా, ఒక జపమాల మీ అన్ని ప్రయత్నాలకు విజయాన్ని చేకూరుస్తుంది.
* ఓం దశరథయే విద్మహే సీతా వల్లభయే ధీ- మహి తన్ నో రామః ప్రచోదయాత్ ||.. ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనస్సు ప్రశాంతతను పొందుతుంది. నిద్ర లేమితో బాధపడేవాళ్ళు ఈ మంత్రం మంచి నిద్రను కలిగిస్తుంది, నిద్రలేమిని నయం చేస్తుంది.
* క్లీం రామ్ క్లీం రామ్ ||..
ఈ మంత్రం చేతబడి నుండి రక్షించే రక్షా మంత్రం. ప్రభావాలు గాని ప్రతికూల ఆత్మలతో సహా అన్ని రకాల ప్రతికూలతలను దూరం చేస్తుంది. ఈ మంత్రం జపించేటప్పుడు మనసు పెట్టండి మంచి ఫలితం పొందవచ్చు.
రామ మంత్ర పఠనం కోసం రుద్రాక్షను లేదా తులసి జపమాలను ఉపయోగించాలి. జపించిన తర్వాత ఆ మాలను పవిత్ర స్థలంలో ఉంచాలి.