• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home ఆధ్యాత్మికం

SriRama Navami : సీతాదేవి నుండి ప్రతీ అమ్మాయి తప్పక నేర్చుకోవాల్సినవి..

R Tejaswi by R Tejaswi
March 30, 2023
in ఆధ్యాత్మికం
0 0
0
SriRama Navami : సీతాదేవి నుండి ప్రతీ అమ్మాయి తప్పక నేర్చుకోవాల్సినవి..
Spread the love

SriRama Navami : శ్రీరామనవమి అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది శ్రీ రాముడు. కానీ సీత దేవి కూడా రాముడితో సమానమైన ధైర్యాన్ని, అణకువను, తెలివిని, మృదువైన స్వభావాన్ని ప్రదర్శించి, అయోధ్యకు పేరు, ప్రతిష్టలు తీసుకొచ్చింది. సీత లేనిదే రామాయణం లేదంటూ రామాయణంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది. అలాంటి సీతాదేవి నుంచి ఈతరం అమ్మాయిలు కొన్ని లక్షణాలు తప్పక నేర్చుకోవాలి.. అవేంటంటే..

ప్రశ్నించే తత్వం..
సీతాదేవికి చిన్ననాటి నుంచి కథలంటే చాలా ఇష్టం. సీతకు ప్రశ్నించడం కూడా బాగా అలవాటు. తండ్రి జనకుడు లేదా తల్లి సునయనను ఎల్లప్పుడూ ప్రశ్నలు అడుగుతుండేది అంట సీతాదేవి. మీ పిల్లలు కూడా ఇలాగే ఏదైనా ప్రశ్న అడిగితే మీరు ఓపిగ్గా సమాధానం చెప్పండి. వారి ప్రశ్నను అడ్డుకునే లాగా ప్రవర్తించకండి.

సీత భయానికి వ్యతిరేకం..
రాముడితో వివాహాం అయ్యాక అందరిలాగే తన భర్తతో కలిసి అత్తవారింటిలో మంచి జీవితాన్ని గడపాలని అందరి ఆడపిల్లానే సీత కూడా కలలు కనింది. కానీ విధి ఆడిన వింత నాటకంలో తన కలలన్నీ నీరుగారిపోయాయి.
తన అత్త కైకెయి కారణంగా 14 ఏళ్లు వనవాసానికి రాముడితో పాటు వెళ్లింది. అయోధ్యలో ఉండి తనకు నచ్చినట్టు జీవించవచ్చు, లేదా పుట్టింటికి వెళ్లిపోవచ్చు.. కానీ సీత అలా చేయలేదు. రాముడితో కలసి ఉండి ధైర్యంగా కష్టాలన్నీ ఎదుర్కుంది.

ప్రతికూల సమయం..

రావణుడు తనను అపహరించినప్పుడు కూడా పరిస్థితులకు లొంగకుండా.. భయపడకుండా, రావణుడిని తన చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యం, సంకల్పం సీత ప్రదర్శించింది. కష్ట సమయంలో కూడా తన వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. సీత పోరాటయోధురాలు తన సమస్యల్ని పోరాటంతోనే ఎదుర్కుంది.

ఒంటరి..
రాజ్యంలోని ప్రజల మాటల వల్ల రాముడు సీతమ్మను అయోధ్య నుంచి బహిష్కరించినప్పుడు వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొందిన సీత అక్కడే కవలలైన లవ, కుశలకు జన్మనిచ్చి వారిని ఒంటిరిగానే పెంచి పెద్ద చేస్తుంది. భారతీయ పురాణాల్లో ఒంటిరి తల్లుల్లో మొదటిది సీతమ్మతల్లి.

పవిత్రత..
రావణుడి చెర నుండి విడుదలైన సీతను రాముడు అగ్ని పరీక్ష పెడతాడు. అప్పుడు సీత ఏమాత్రం జంకకుండా అగ్నిలో దూకి తన పవిత్రతను నిరూపించుకుంటుంది.
లవ, కుశల జననం తర్వాత సీతకు అయోధ్యకు తిరిగిరావడానికి అవకాశం వచ్చినా.. సీత తన పరువు, వ్యక్తిత్వం కోసం పోరాడింది. తన భర్తతో అయోధ్యకు వెళ్లకుండా తన తల్లి అయిన భూతల్లితో కలిసిపోవడమే మంచిదని భావించి, తన తల్లిలో కలిసిపోతుంది. అన్ని సందర్భాల్లో కూడా సీత ఒక శక్తివంతమైన మహిళగానే నిలబడింది.


Spread the love
Tags: AdipurushDasaraKeerthySureshLordRamLordRamaNaniPrabhasRamNavamiSithaSithaDeviSrikanthOdelaSriRamaNavami
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.