Temple : శివపార్వతుల ముద్దుల తనయుడు సుబ్రమణ్య స్వామి తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. ఈ స్వామి దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన దక్షిణ కన్నడ ఆలయంలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామిగా భక్తుల కోరికలు తిరుస్తూ కొలువై ఉన్నాడు..ఇక్కడి దేవాలయానికి ఓ విశిష్టత ఉంది.
ఇక్కడికి వచ్చిన భక్తులకు “వల్మీక మృత్తిక” అంటే పుట్ట మన్నును ప్రసాదంగా ఇస్తారు.ఈ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి నాగదేవతల ఆశీస్సులు ఉంటాయి. నాగుల భయం ఉండదు.అబ్బాయిలకు,అమ్మాయిలకు వివాహం విషయంలో అవరోధాలు ఉంటే, ఈ “వల్మీకి మృతిక” ను కలిపిన నీళ్లతో స్నానం చేసి తరువాత
శుభ్రమైన వస్త్రాన్ని కట్టుకొని నేతి దీపం తో ఆ స్వామికి పూజ చేస్తే ఎలాంటి దోషాలు ఉన్నాకుడా తొలగిపోయి వివాహం జరుగుతుంది.ఇక ఈ గుడి ఆదాయం చరిత్ర సృష్టించింది. 2022-23 సంవత్సరంలో 123 కోట్ల 64 లక్షల రూపాయల ఆదాయాన్ని ఈ ఆలయం ఆర్జించింది.
క్షేత్ర చరిత్రలో తొలిసారిగా ఈ ఆలయ వార్షిక ఆదాయం 100 కోట్లు దాటింది.గతేడాది 51 కోట్ల అదనపు ఆదాయంగా ఉన్న ఈ ఆలయం ఒకేసారి 100 కోట్లు ఆదాయం దాటింది. కుక్కే దేవాలయం నాగారాధనకు ఈ ఆలయం చాలా ప్రసిద్ధి కావడంతో, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి నాగదేవుని కృపను పొందుతారు.