Ugadi Festival 2023 : జీవితంలో అన్ని రుచుల మేళవింపును గుర్తు చేసుకునే పండగ ఉగాది. యుగానికి ఆదిగా మొదలైన పండగ. మన పూర్వీకులు మంచితో పాటు, కొంతమంది అత్యుత్సాహం వల్లనో మరే ఉద్దేశ్యంతోనో, ఆచరణలో పెట్టిన వాటిని అతి చేసి.. దురాచారణ అని ‘మూడం’ అంటే.. మూఢనమ్మకంగా తయారు చేశారు. మనందరికీ తెలిసినట్టుగానే ఆయుర్వేదంలో వేపకు ప్రత్యేక స్థానం ఉంది.
వేప చెట్టులో ఉన్న ప్రతి ఒక్కటీ మనకు, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని మన చరకమహర్షులు ఇచ్చిన అమూల్యమైన గ్రంధంలో ఉంది. అంతేకాదు మన ఆయుర్వేదంతో ఎన్నో రకాల ఫార్మ మందులు కనిపెట్టిన దాఖలాలున్నాయి. అయ్యినప్పటికీ మన సేద్యం ఇక్కడ వారి మనసులో విషబీజం అయ్యింది. ఎన్నో సద్గుణాలున్న వేప పువ్వు ఉగాది పండగలో ముఖ్యమైంది.
అలాగే ఉగాది పచ్చడిలోని షడ్రుచులను వగరు, కారం, పులుపు, ఉప్పు, చేదు, తీపి ప్రతి రుచుని ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోవాలి అనేది ఈ ఉగాది పండుగ ముఖ్య ఉద్దేశం. మీరు, మీ కుటుంబ సభ్యులు దైర్యంగా ముందుకు సాగుతూ మరెన్నో విజయాలు సాధించాలని ఆశిస్తూ ట్రెండ్ ఆంధ్ర తరపున శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు..