Vastu Tips : మనం ఇల్లు కట్టుకునే ముందే వాస్తు ప్రకారం అన్ని చూసుకుని కట్టుకుంటూ ఉంటాం. వాస్తులో ఏ చిన్న లోపం వచ్చిన అది మన కుటుంబాలకు, ఇంటికే ప్రమాదమని చాలా జాగ్రత్తగా ఆచితూచి ఇల్లును కట్టుకుంటూ ఉంటాం కానీ.. మనం తెలిసీ, తెలియక చేసే చిన్న, చిన్న పొరపాట్లే మనకు పెద్ద సమస్యలై కూర్చుంటాయి. కొన్ని సందర్భాల్లో వీటికి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.
మరి అలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మంచి ఫలితాలను పొందడం ఎలానో చూద్దాం..
ఇంటి ప్రధాన ద్వారం..
* చెత్త బుట్టలను ఇంటి ప్రధాన గుమ్మానికి ఎదురుగా పెట్టకూడదు. అలాగే చీపురు కూడా అలా ఎదురుగా పెట్టవద్దు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే సాయంత్రం సమయంలో ఉప్పు, పాలు, పెరుగు అసలు దానం చేయకూడదు.
వాస్తు శాస్త్ర ప్రకారం ఇలా దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం ఇల్లును సర్దుకుంటేనే ఇలాంటి సమస్యలు తలెత్తవు. లేదంటే ఇబ్బందులను కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది.
మంచం మీద..
మనలో చాలామంది మంచం మీదనే కూర్చుని తింటూ ఉంటారు. ఇలా కూర్చోని ని తినడం వల్ల వాస్తు ప్రకారం సమస్యలు వస్తాయి. ఇంకా ముఖ్యంగా పేదరికం రావడానికి కూడా కారణం అవుతుంది. అది ఎలా అంటే.. మంచంలో కూర్చోని తినడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. నేల మీద అయినా కూర్చొని తినాలి, లేదంటే కుర్చీ మీదైనా కూర్చొని తినాలి. దీనితో పాటు రాత్రిపూటే వంటగదిని శుభ్రం చేసుకోవాలి. లేకుంటే ఇంటికి చాలా అరిష్టం.
బాత్ రూంలో..
రాత్రిపూట బాత్ రూంలో నల్ల బకెట్ ఉంచకూడదు. ఇలా పెట్టడం వల్ల ప్రతికూల శక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అలాగే అందరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరంగా ఉండాలంటే నిద్రించే సమయంలో బకెట్ నిండా నీళ్లు నింపి బాత్ రూంలో ఉంచాలి. అలా చేయడం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఇలా వాస్తు చిట్కాలు పాటించి సమస్యలు మన దరి చేరకుండా చూసుకోండి.