Vastu Tips about Ganneru Tree : కొన్ని మొక్కలు ఇంట్లో నాటడం వల్ల, ఇంటికి అందం ఇవ్వడమే కాకుండా ఇంట్లో శుభాలను కూడా తీసుకువస్తాయి. అటువంటి మొక్కలలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న మొక్క గన్నేరు మొక్క. తెలుపు ,పసుపు, లేత గులాబీ, గులాబీ రంగులో ఉండే ఈ గన్నేరు పువ్వులు వాస్తు శాస్త్ర ప్రకారం చాలా పవిత్రమైనవి.
ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవికి గన్నేరు పూలతో పూజ చేస్తారో, ఆ ఇల్లు సకల, సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి గన్నేరు పువ్వులు అంటే మహాప్రీతి. లక్ష్మీదేవి కటాక్షం కావాలనుకునే వారు ఇంట్లో తెల్ల గన్నేరు చెట్టును పెంచి, ఆ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి చల్లని చూపు ఆ కుటుంబం పైన ఉంటుంది.

శ్రీమహావిష్ణువుకు పసుపు గన్నేరు పువ్వులు అంటే చాలా ఇష్టం. ఆ పూలతో మహావిష్ణువుని కొలిస్తే ఆ ఇంట్లో సంపద, సౌభాగ్యం, సంతోషం వచ్చి సమస్యలు తొలగిపోయి ఆ ఇంటి వారు ఆనందంగా ఉంటారు. ఈ పసుపు గన్నేరు పువ్వును ఇంటిలోని ఈశాన్యం లేదా తూర్పు భాగంలో నాటడం ఉత్తమం.
వీటితోపాటు పసుపు గన్నేరు మొక్కను ఇంటి యొక్క ప్రధాన ద్వారం ముందు తూర్పు భాగంలో నాటడం వల్ల ఆ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. వేద జ్యోతిష్య శాస్త్రంలో గన్నేరు పువ్వుకు చాలా ప్రముఖమైన స్థానం ఉంది. ఇంట్లో ఉన్న ఎన్నో సమస్యలకు గన్నేరు పువ్వుల ఆరాధన సరైన మార్గమని జ్యోతిష్య శాస్త్రంలో లిఖించబడి ఉంది.
