Vastu Tips :హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఇంట్లో దీపారాధన చేయడం చాలా మంచిది. ప్రతిరోజు దీపారాధన చేస్తే ఇంటిలోని ప్రతికూల శక్తులన్నీ మాయమవుతాయి. మన ఇంటికి, ఇంట్లో వాళ్లకి శుభాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. అయితే ఈ దీపాన్ని వాస్తు శాస్త్ర ప్రకారం ఎలా పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి ,చేయకూడని తప్పులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
వాస్తు శాస్త్రం ప్రకారం..ముందుగా ఇంటిని శుభ్ర పరుచుకోవాలి. ఆ తర్వాత కుందులు శుభ్రం చేసుకుని దీపం వెలిగించుకోవాలి. లేదంటే ప్రతికూల శక్తులు వచ్చి చేరే అవకాశం ఉంది. దీపం పెట్టే ముందు ఇంటిని గంగాజలంతో శుద్ధి చేసుకోవాలి అని పండితులు చెపుతున్నారు.
సాయంత్రం కాగానే ఇంటి ముఖ ద్వారం వద్దా దీపం వెలిగిస్తే లక్ష్మీ దేవి ఇంట్లో ఉన్నట్టే. ఆమె దయ మీ మీద ఉండి,ఆరోగ్యం, సంతోషం మీ సొంతం అవుతాయి. దీపాన్ని వెలిగించాక చిన్న ప్లేట్ లో దీపాన్ని పెట్టుకోవాలి..దీపాన్ని నేల మీద పెట్టకూడదు అని పండితులు చెబుతున్నారు.
అలాగే దీపం కింద తమలపాకులు పెడితే మంచిదని ఇంట్లో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని పండితులు సూచిస్తున్నారు.