Vastu Tips : సుర్యోదయాన్ని చూసి ఆ సూర్యభగవానుడికి నమస్కరించుకుంటే మన జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా సాగుతుంది. వాస్తు శాస్త్రంలో సూర్యభగవానుడికి అంత ప్రాముఖ్యత ఉంది. మన భారతీయులు ఎక్కువగా సూర్యుడిని పూజిస్తారు. అంత విశిష్టత కలిగిన సూర్యకిరణాలు మన శరీరంపై పడితే, మనం ఆరోగ్యంగా ఉంటాము. ఆ సూర్యభగవానుడి దయ మనపై ఉండాలని అంటే మన ఇంట్లో ఒక పని చేయాలి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.
సూర్యుడికి చిహ్నంగా రాగితో తయారుచేసిన సూర్యుడి ప్రతిమను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఇంటి ముఖద్వారం గోడపై సూర్యుడి ప్రతిమను ఉంచితే ఆ ఇంటికి అది శుభప్రదం. ఈ రాగి ప్రతిమ సూర్యుడు ఇంటి మొత్తానికి గొప్ప శక్తిని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా ఆ ఇంట్లోని వారందరికీ విజయం, కీర్తి, శ్రేయస్సు లభించి, ఇంట్లోని వ్యక్తుల మధ్య సామరస్యానికి సహాయపడుతుంది.
రాగి సూర్యుడి ప్రతిమ మన ఇంట్లో ఉంటే మనం చేసే పనికి విజయ సంకేతంగా ఉంటుంది.. మనకు విజయం వరిస్తుంది. రాగి సూర్యుడిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. మీలోని ప్రతిభా, పాటవాలకు ఎటువంటి తిరుగు ఉండదు. ముఖ్యమైన ప్రముఖ వ్యక్తులతో మీకు పరిచయాలు కలిగి మీకు లాభం చేకూరుతుంది.
కొంతమంది ఇళ్లల్లో, ఆఫీసు గదులల్లో తూర్పు దిక్కున తలుపులు, కిటికీలు ఉండవు. అలాంటి వారు వాస్తు దోషంతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ రాగి ప్రతిమ సూర్యుడిని తూర్పు దిక్కున ఉంచితే వాస్తు దోషం తొలగిపోతుంది. ఈ రాగి ప్రతిమ సూర్యుడు ఎవరి ఇంట్లో కొలువై ఉంటాడో.. ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో కళకళలాడుతుంది.