Vastu Tips : ఇంట్లో అన్ని గదుల కంటే అత్యంత పవిత్రమైనది , ప్రముఖమైనది పూజ గది. అలాంటి పూజ గదిని వాస్తు ప్రకారం ఎటువైపు నిర్మించుకోవాలి. ఏ దిశగా పెట్టుకొని పూజ చేస్తే ఆ ఇంటికి శుభాలు జరుగుతాయో తెలుసుకుందాం. చాలామంది ఇల్లల్లో మెట్ల కింది భాగంలో ఖాళీ స్థలం ఉందని అక్కడ పూజ గదిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.
కానీ అది చాలా తప్పుడు నిర్ణయం.మెట్ల కింద పూజగది అసలు ఉండకూడదు. అలా పెట్టడం వల్ల ఆ ఇంట్లో చాలా సమస్యలు తలెత్తి, అనారోగ్యం బారిన పడతారు. ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు ఆ ఇంటి వారికి వచ్చే అవకాశం ఉంది. అలాగే బాత్రూం దగ్గరలో కూడా పూజ గది ఉండకుండా జాగ్రత్త పడాలి.
అలా పూజగదిని బాత్రూం దగ్గరలో ఏర్పాటు చేసుకుంటే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. బెడ్ రూమ్ లో కూడా పూజ గదిని ఏర్పాటు చేసుకోకూడదు. అలాగే బేస్మెంట్ లాంటి స్థలాల్లో కూడా పూజ గది ఉంచకూడదు. పూజ గదిని ఎప్పుడూ కూడా గాలి,వెళుతురు బాగా వచ్చే దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి.