Vastu Tips : “మనీ ప్లాంట్” ఈ పేరు మీరు వినే ఉంటారు. ఇప్పుడు చాలా ఇళ్లల్లో ఈ ప్లాంట్ దర్శనమిస్తుంది. వాస్తుశాస్త్రంలో మనీప్లాంట్ మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ మొక్క నాటడం వల్ల ఇంట్లోని నెగటివ్ వైబ్రేషన్స్ దూరమయి, పాజిటివ్ వైబ్రేషన్స్ ని, ఇంట్లో శక్తిని ఇస్తుందని అని నమ్ముతారు.
అయితే ఈ మనీ ప్లాంట్ ని దేంట్లో నాటాలి, ఏ ప్లేస్ లో, ఏ దిక్కున నాటాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనీ ప్లాంట్ మొక్కను కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో మాత్రమే నాటాలి. ఎప్పుడూ కూడా దక్షిణ దిశలోనే ఈ మొక్కను ఉంచాలి. ఉత్తరం లేదా తూర్పు దిశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు.
అలాగే ప్లాస్టిక్ మెటీరియల్ లో ఈ ప్లాంట్ ని అసలు పెంచకూడదు. దీనికోసం గాజు పాత్రలను కానీ మట్టి పాత్రను కానీ వాడుకోవడం మంచిది. వాస్తు ప్రకారం అప్పుల నుంచి బయటపడేందుకు చాలామంది మనీ ప్లాంట్లను ఇళ్లలో పెంచుతున్నారు. ఈ మనీ ప్లాంట్ కు ఖర్చు చాలా తక్కువ. చూడడానికి ఎంతో అందంగా,
ఆకర్షణీయంగా కనిపించే ఈ మనీ ప్లాంట్ ని చాలా సులభంగా ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది. ఎంతలా తీగలు పారితే అంతలా మీ ఇంట్లో లక్ష్మీదేవి కోలువున్నట్టే. ఎందుకంటే మనీ ప్లాంట్ మొక్క లక్ష్మీదేవి ప్రతిరూపమని చెప్తారూ.. అందుకే ఈ మనీ ప్లాంట్ మొక్క తీగలు కింద పారకుండా చూసుకోవాలి.