Vastu Tips : ఎవరికైనా ఇంటిని అలంకరించుకోవడం అనేది చాలా ఇష్టంగా చేసుకునే పని. ఇంట్లో రకరకాల బొమ్మలు పెట్టి అలంకరిస్తే ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. కానీ వాస్తు శాస్త్రంలో కొన్ని బొమ్మలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అవి మీ ఇంట్లో అలంకరించినట్లయితే మీ ఇల్లు సకల, సంతోషాలతో, సౌభాగ్యాలతో విరాజిల్లుతుంది. మరి ఆ బొమ్మలేమిటి ? వాటికున్న ప్రత్యేకత ఏంటి.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవు : సనాతన సంప్రదాయం ప్రకారం ఆవుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆవులు సకల దేవతలకు ప్రతీకగా భావిస్తారు. ఆవు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల సకల, సంతోషాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి.
ఏనుగుల జత : వాస్తు శాస్త్రములో ఏనుగులకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏనుగుల జతలను ఇంట్లో అలంకరించినట్లయితే ఆ కుటుంబంలో ఐక్యత పెరిగి, వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అయితే వెండి లేదా ఇత్తడి ఏనుగులు వాడడం ఉత్తమం.
తాబేలు : ఆ విష్ణుకు మరో రూపం తాబేలు. తాబేలు బొమ్మ ఇంట్లో ఉంచడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. ఈ తాబేలును తూర్పు లేదా ఉత్తర దిశలో అలంకరించుకోవాలి. అప్పుడు సంతోషం ఆ ఇంట్లో కొలువై, అభివృద్ధి చెందుతారు.
బాతుల జంట బొమ్మలు : పడకగదిలో బాతుల జంట బొమ్మలను అలంకరిస్తే దంపతుల మధ్య ప్రేమానురాగాలు వృద్ధి చెంది, కుటుంబం అనుబంధాలు బలోపేతం అవుతాయి. అని వాస్తు శాస్త్రం సూచిస్తుంది.
ఒంటె : వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో ఒంటె విగ్రహం ఉండడం చాలా శుభం. ఒంటె పోరాటాలకు విజయంగా భావిస్తారు. ఒంటె విగ్రహం ఇంట్లో అలంకరించడం వల్ల మనం అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.
చేప : వాస్తు శాస్త్ర ప్రకారం చేప సంపదకు ప్రతీక. వెండి లేదా ఇత్తడి చేపలను ఇంట్లో అలంకరించడం వల్ల ఆ ఇల్లు ఆనందంతో వృద్ధి చెంది సౌభాగ్యాలు కలిసి వస్తాయి. ఈ చేపను ఈశాన్యం లేదా తూర్పు దిశలో అలంకరిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.