• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home ఆధ్యాత్మికం

మూడుమార్లు రామ నామ స్మరణచే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం లభిస్తుందా?

TrendAndhra by TrendAndhra
December 22, 2022
in ఆధ్యాత్మికం
0 0
0
మూడుమార్లు రామ నామ స్మరణచే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం లభిస్తుందా?
Spread the love

శ్రీ రామ…

ఓ రామ నీ నామ మెంత రుచిరా..

మన హిందూ సనాతన ధర్మము నందు “శ్రీ రామ” అనే అక్షరం వ్రాయనిదే మనకు ఏదీ ఆరంభం కాదు…

అతులిత మధురం రామ నామము…

శ్రీమన్నారాయణ మంత్రములో “రా” జీవమును..
శివ పంచాక్షరి మంత్రములోని “మ” జీవాన్ని..

కలిపి రామ అనే నామముతో దశరథ సుతాగ్రజునికి నామకరణం చేసారు వశిష్ఠ మహర్షుల వారు. సృష్టిలోని తీయందనము, దివ్యత్వము అంతా కలిపి ఆ దివ్యనామము లోనే ఉందేమో.. రామా అన్న చాలు హరియించును సర్వ పాతకములు. జన్మ జన్మల లోని దోషాలన్నీ హరించి పోతాయి ఈ నామ సంకీర్తనము ద్వారా..

అందుకే మన కంచెర్ల గోపన్న గారు “ఓ రామ నీ నామ మెంత రుచిరా” అని పాడి భక్త రామదాసు అయిపోయారు.. ఎందరో మహా భక్తులు రామ నమ మహితాత్మక శక్తి చేత ధన్యులయ్యారు. రాతిని నాతిని చేసిన పరమ పావనమీ దివ్య నామము. కరకు బోయ తిరగేసి పలికితే కవిగా చేసిన నామమీ దివ్య నామమని మన ఆరుద్ర వారు చెబుతారు.

ఓ రోజు ఓ గురువు గారు తన శిష్యులకు విష్ణు సహస్ర నామ ఫలితం గూర్చి చెబుతూ.. అందులో చివరన వచ్చు..

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితము లభించునని చెప్పారు..

అది విన్న ఒక శిష్యుడు గురువర్యా.. ఒక్క “రామ” అనే నామము మూడు మార్లు పలికినంత మాత్రం శ్రీహరి వేయి నామాలు పఠించిన పుణ్యం ఎలా లభించునని అడుగగా తెలివైన ఆ గురువు ఈ విధముగా సెలవిచ్చారు..

శిష్యా .. రామ నామము దివ్యమైనది .. అది వేయి నామాలకు ఎలా సమానమో చెబుతాను విను.. “రామ” అనే నామములోని రెండక్షరాలు.. సంస్కృతంబున హల్లులు అయిన “య, ర, ల, వ, స ” లలో “ర” రెండవ అక్షరము. అలాగే సంస్కృత హల్లులు లోని “ప, ఫ, బ, భ, మ” లలో “మ” అయిదవ అక్షరము…

ర = 2, మ = 5.. వీటిని గుణిస్తే వచ్చే ఫలితం 10

అలా ముమ్మారు రామ నామము ను పలకడం వల్ల వచ్చే ఫలితం 2X5X2X5X2X5 = 1000

ఎవరికైతే విష్ణుసహస్రనామ పారాయణము చేయడానికి ఒడలు, మనస్సు, సమయము సహకరించదో అట్టి వారికి రామ నామము ముమ్మారు జపించిన ఫలితం వల్ల విష్ణుసహస్రనామ పారాయణ ఫలితం లభించునని ఆ గురువు గారు సెలవిచ్చెరు. ఆ వివరణ విన్న ఆ శిష్యుడు తన సందేహము విడచి ఆనందముతో విష్ణుసహస్రనామ పారాయణము గావించుతూ తరించాడు.

శ్రీరామ శ్రీరామ శ్రీరామ

Spread the love
Tags: Devotional Latest News in TeluguDevotional NewsDevotional News in TeluguDevotional News TeluguLatest Bhakthi NewsLatest News on GodLatest News on Lord KrishnaLatest News on Lord ShivaLatest News on Lord VishnuLatest News on Sri RamaLatest Telugu Spirituality NewsTelugu Devotional NewsToday Devotional News in TeluguTrend AndhraTrend Andhra Devotional NewsTrend Andhra NewsTrendandhra Latest Devotional NewsWhat happens if we chant Vishnu Sahasranamam?భక్తిశ్రీరామ
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.