Direction of Hanuman Idol Direction in Home as per Vastu : హిందూ సనాతన ధర్మంలో ప్రార్థనా స్థలానికి ప్రత్యేక స్థానం ఉంది. వాస్తులో దేవతామూర్తుల విగ్రహాలను ఇంట్లో ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. హిందూ మతంలో.. హనుమంతుడు కలియుగ దేవతగా పరిగణించబడతాడు. ఈ రోజు ఇంట్లో హనుమంతుని విగ్రహాన్ని ఏ దిక్కున ఉంటే శుభమో తెలుసుకుందాం.
వాస్తు నియమాల ప్రకారం.. పడకగదిలో హనుమంతుడు ఫోటో లేదా విగ్రహాన్ని ఎప్పుడూ ఉంచకూడదు. హనుమంతుడు విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదం. ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం, హనుమంతుని విగ్రహం లేదా ఫోటోను దక్షిణ దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో హనుమంతుడు కూర్చున్న స్థితిలోఉండాలని గుర్తుంచుకోండి.
అలాగే హనుమంతుడు విగ్రహాన్ని ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవచ్చు. హనుమంతుని ఫోటోను ఈ దిశలో ఉంచడం ద్వారా మనిషికి కష్టాలు త్వరగా తొలగిపోతాయని ఒక నమ్మకం. వాస్తు శాస్త్రం ప్రకారం పంచ ముఖ హనుమంతుని ఫోటోను ఇంట్లో ఉంచడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు , సంపదలు చేకూరుతాయి. పంచ ముఖ హనుమంతుడుని ఇంట్లో పెట్టుకోవడానికి దక్షిణ దిశను ఎంచుకోవాలి. పర్వతాన్ని ఎత్తుతున్న హనుమంతుని బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం శుభప్రదం అని ఒక నమ్మకం. హనుమంతుడు ఫోటోతో.. ఆ వ్యక్తి ఎటువంటి పరిస్థితులోను ఎదురైనా సరే సులభంగా దాటవచ్చు.
Also Read : ఇంటిలో బీరువాను ఏ వైపుకు ఉంచాలి? – Beeruva Position as Per Vastu in Telugu
ఎక్కడైనా హనుమంతుని ఫోటో లేదా విగ్రహం ఉంటే.. ఆ ప్లేస్ ఎల్లప్పుడూ శుభ్రత ఉండాలి. పూజలు క్రమం తప్పకుండా చేయాలి. హనుమంతుని విగ్రహం ఉన్న ఇళ్లలో ప్రతి మంగళవారం రోజున ఆయనను పూజించడం, సుందరకాండ పారాయణం చేయడం శుభప్రదం. ఇంటి దక్షిణ గోడపై ఎరుపు రంగులో కూర్చున్న భంగిమలో హనుమంతుని చిత్రాన్ని ఉంచడం ద్వారా, దక్షిణం వైపు నుండి వచ్చే ప్రతికూల శక్తి నాశనం అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, హనుమంతుని ఫోటో లేదా విగ్రహాన్ని మెట్ల క్రింద, వంటగది లేదా మరేదైనా అపవిత్ర ప్రదేశంలో ఉంచవద్దు.