Why not Non Veg Eat on These Days : శాకాహారం.. మాంసాహారం రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అంటే.. అధిక శాతం మంది శాఖాహారమంటారు. మాంసాహార ప్రియులేమో మాంసాహారమేని అంటుంటారు. వాస్తవానికి శాఖాహారం, మాంసాహారం రెండు ఆరోగ్యానికి ముఖ్యమైనవే. కానీ, మాంసాహారము మాత్రమే నిత్యమూ తీసుకునే వారు చాలా తక్కువ. మిశ్రమ ఆహారం తీసుకునే వారినే మాంసాహారులు అంటారు. అయితే మాంసాహారం తినడం వల్ల ఎటువంటి నష్టము జరుగదు. కానీ మాంసాహారం వల్ల కలిగే లాభాలను, శాకాహారము తీసుకోవడం ద్వారా కూడా పొందవచ్చు. కాబట్టి మనకు ఆరోగ్యప్రదమైన దానినే ఉత్తమ ఆహారంగా నిర్ణయించుకోవాలి.
ముఖ్యంగా శరీరానికి కావాల్సిన మాంసకృతులు బి-12 లాంటి కొన్ని విటమిన్స్ మాంసాహారం లోనే ఎక్కువగా దొరుకుతాయని, మాంసాహారం తింటేనే మనిషి బలంగా తయారవుతాడని అంటారు. అయితే సోమ, మంగళ, గురు, శనివారాల్లో మాంసాహారం తింటే అసలు మంచిది కాదా…? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకప్పుడు బ్రాహ్మణులంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారట. జనాలు మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా వారి ఆరోగ్యానికి హానికరమని భావించి కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలని నిర్ణయించారట, అయితే దీనికి చాలామంది ఒప్పుకోలేదట.
దీంతో కనీసం సోమ, మంగళ, గురు, శనివారాల్లో అయినా మాంసాహారం మానిపించాలని, అలా చేస్తే ఆ రోజుల్లో పూజించే దైవాలు అనుగ్రహం లభిస్తుందని చెప్పారట. దీంతో ఆ రోజుల్లో నాన్ వెజ్ తినడం మానేశారు జనాలు. దీనికి మరో కారణం ఏమిటంటే.. మాంసాహారం తామస ఆహారం. అంటే ఒంట్లో కామాన్ని, కోరికలను పెంచుతుంది. దీంతో మనుషులు వాటి బారినపడి ఉచ్చ, నీచాలను మరిచి చేయకూడని పనులు చేస్తారు. వ్యక్తిగత నియంత్రణ ఉండదు. కాబట్టి ఇలా జరగకుండా ఉండేందుకు సెల్ఫ్ కంట్రోల్ కోసం జనాలు ఆయా రోజుల్లో నాన్వెజ్ తినడం మానేశారు.