Yadadri Lakshmi Narasimha:యాదాద్రికి పోటెత్తిన భక్త జనసంద్రం… కిక్కిరిసిన ఆలయ పరిసరాలు
తెలంగాణా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది.ఆదివారం సెలవు దినం కావడంతో హైదరాబాద్ నుండి కూడా స్వామి వారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.దీనితో ఆలయం పరిసర ప్రాంతాలు అన్నీ లక్ష్మి నరసింహుడి నామస్మరణతో మారుమోగుతున్నాయి.
అలాగే కొండ కింద ఉన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకొని, ఆ తరువాత కొండ పైన ఉన్న తమ ఇష్ట దైవమైన యాదాద్రీశుడిని దర్శించుకుంటున్నారు.రద్దీ దృష్ట్యా స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది అని ఆలయ అధికారులు తెలిపారు.