రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై మూడు భారీ ప్రాజెక్టులు చేయనున్న విషయం తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో మూడు ప్రాజెక్టులు చేయడంపై తాజాగా ప్రభాస్ స్పందించారు. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ హోంబలే గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.
విభిన్నమైన కథలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో విజయ్ కిరంగదూర్ ‘హోంబలే ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆయన విజన్, కథల ఎంపిక వల్లే ఈ నిర్మాణ సంస్థ ఈ స్థాయికి చేరిందని ప్రభాస్ అన్నారు. అందరితో కలివిడిగా ఉండే విజయ్.. తనతో కలిసి వర్క్ చేసే వారిని జాగ్రత్తగా చూసుకుంటారని ప్రభాస్ చెప్పారు. సలార్‌తో మొదలైన తమ ప్రయాణంలో తామంతా ఒక కుటుంబంలా మారినట్లు చెప్పుకొచ్చారు. విజయ్ కిరంగదూర్ కుటుంబ సభ్యుడితో సమానమని ప్రభాస్ అన్నారు.
కేజీఎఫ్ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం..
కేజీఎఫ్ షూట్‌లో చోటు చేసుకున్న ఒక సంఘటన గురించి చె రు. ఆ సినిమా కోసం ఒక భారీ సెట్ వేయగా అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగిందట. బడ్జెట్ విషయంలో టీమ్ అందరూ ఎంతో కంగారుపడుతుండగా.. విజయ్ వచ్చి ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు సినిమా అనుకున్న విధంగానే జరుగుతుందని ధైర్యం చెప్పారని ప్రభాస్ నాటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. సినిమా మేకింగ్‌కు వచ్చే సరికి క్వాలిటీ విషయంలో విజయ్ కిరంగదూర్ ఎక్కడా రాజీ పడరని, ఆ విషయం తనకెంతో నచ్చిందని.. అందుకే హోంబలే ఫిల్మ్స్‌తో వరుస ప్రాజెక్టులు చేస్తున్నట్లు ప్రభాస్ తెలిపారు.
సలార్-2 కూడా హోంబలేతోనే..
పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన నిన్నిందలేతో విజయ్ కిరంగదూర్ స్థాపించిన హోంబలే ఫిల్మ్స్ ప్రయాణం మొదలైంది. 2018లో కేజీఎఫ్ ఈ సంస్థకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన కాంతార ఈ నిర్మాణ సంస్థకు భారీగా లాభాలతో పాటు దేశవ్యాప్తంగా మంచి పేరును అందించింది. సలార్ సీజ్ ఫైర్ కూడా భారీ వసూళ్లను తెచ్చిపెట్టింది. సలార్-1 2023లో రాగా.. దీనికి కొనసాగింపుగా సలార్-2 రానుంది.
ప్రభాస్‌తో చేయబోయే మూడు ప్రాజెక్టు వరుససగా 2026, 2027, 2028ల్లో నిర్మిస్తామని గతేడాది చివర్లో హోంబలే ప్రకటించింది. అయితే ఆ ప్రాజెక్టులు ఏమిటనే విషయాన్ని మాత్రం నిర్మాణ సంస్థ తెలియజేయలేదు.