Nani Paradise: ‘ది ప్యారడైజ్’లో నాని లుక్ మామూలుగా లేదుగా.. చూస్తే పూనకాలే..!
Nani Paradise: నేచురల్ స్టార్ నాని – డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన మూవీ ‘దసరా’. ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నానిలో మరో కోణాన్ని పరిచయం చేసింది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు నాడు. ఈ ఇద్దరి కాంబోలో మరో మూవీ అనగానే అందరిలో ఉత్కంఠ నెలకొంది. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న మరో భారీ యాక్షన్ డ్రామానే ‘ది ప్యారడైజ్’.
ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది ‘ది ప్యారడైజ్’. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా లీకైన నాని లుక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
లీకైన లుక్‌లో నాని పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో పూర్తిస్థాయి మాస్ గ్యాంగ్‌స్టర్ అవతారంలో కనిపించడంతో అభిమానులు ఫిదా అయ్యారు. “ఇది నాని కెరీర్‌లో బెస్ట్ లుక్” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘దసరా’లో కనిపించిన రఫ్ అండ్ టఫ్ లుక్‌ను మించి ఈ కొత్త గెటప్ ఉండటం ‘ది ప్యారడైజ్’పై అంచనాలను అమాంతం పెంచింది. ఈ పాత్ర కోసం నాని జిమ్‌లో గట్టిగానే కష్టపడ్డట్లు తెలుస్తోంది. సన్నగా, అదే సమయంలో కండలు తిరిగిన శరీరంతో, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో నాని ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నారని సినీ వర్గాల సమాచారం.
1980-90ల కాలం నాటి హైదరాబాద్ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. మోహన్ బాబు, కయాదు లోహార్, రాఘవ జుయల్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అనిరుధ్ అందించే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్నారు.
