Best Spy Action Thiller OTT Movies: గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో.. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ‘స్పై యాక్షన్ థ్రిల్లర్’ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు విశేష ప్రజాదరణ పొందుతున్నాయి. దేశభక్తి, గూఢచర్యం, ఉత్కంఠభరితమైన కథాంశాలతో రూపొందుతున్న ఈ తరహా చిత్రాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. స్పెషల్ ఆప్స్, అదృశ్యం, తనావ్ వంటి సిరీస్‌లు ఈ జానర్‌లో విజయవంతమైన సృష్టిలుగా నిలిచాయి. మరి ఇవన్నీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందామా..?
జీ5లో.. బెర్లిన్ స్ట్రీమింగ్..
1993లో ఢిల్లీలో గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కున్న అశోక్ కుమార్ అనే దివ్యాంగుడి చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన బెర్లిన్ అద్భుతంగా ఉంటుంది. చెవిటి, మూగ వాడైన అశోక్‌ను విచారించే క్రమంలో ఇంటెలిజెన్సీలు ఎవరి సాయం తీసుకున్నారు, అలాగే నిజంగానే అసోక్ గూఢచర్యం చేశాడా వంటి అంశాలతో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ మూవీ తెరకెక్కగా.. ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం జీ5 వేదికగా అతుల్ సభర్వాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
తనావ్ సీజన్ 2.. సోనీలివ్‌లో స్ట్రీమింగ్
స్పెషల్ టాస్క్ గ్రూప్, ఓ ఉగ్రవాది ముఠా మధ్య జరిగే ఘర్షణ ఇతివృత్తంగా రూపొందిన వెబ్ సిరీస్‌యే తనావ్. ఇప్పటికే ఫస్ట్ సీజన్ రాగా.. తాజాగా రెండో సీజన్ కూడా వచ్చేసింది. హతమయ్యాడనుకున్న ఓ ఉగ్రవాది బతికే ఉన్నాడని తెలుసుకున్న.. విశ్రాంత ఎస్టీజీ ఆఫీసర్ కబీర్ ఫరూఖీ, అతడి బృందం ఎలాంటి చర్యలు చేపట్టింది.. ఎలాంటి సవాళ్లను ఎదురుకున్నారు వంటి అంశాలతో రూపొందించే ఈ వెబ్ సిరీస్. ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండే దీన్ని సుధీర్ మిశ్రా, సచిన్ క్రిష్ణ్, ఇ నివాస్ తెరకెక్కించారు. ప్రస్తుతం సీనీలివ్‌లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
కాఠ్‌మాండూ కనెక్షన్, అదృశ్యం, ముఖ్బీర్: ది స్టోరీ ఆఫ్ ఎ స్పై..
1993లో ముంబయిలో జరిగిన పేలుళ్లు, 1999లో జరిగిన విమాన హైజాక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్.. ఓ డిటెక్టివ్, జర్నలిస్టు పాత్రల ప్రధానంగా సాగుతుంది. సిద్ధార్థ్ మిశ్రా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్లు కూడా సోనీలివ్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ యాక్టివిటీస్‌కు చెందిన ఇద్దరు హై-ప్రొఫైల్ సీక్రెట్ ఏజెంట్స్ ఇతివృత్తంగా రూపొందిన వెబ్ సిరీస్ అదృశ్యం-ది ఇన్విజిబుల్ హీరోస్. దీన్ని అన్షుమాన్ కిశోర్ సింగ్ రూపొందించగా.. సోనీలివ్‌లో స్ట్రీమంగ్ అవుతోంది. అలాగే ముఖ్బీర్: ది స్టోరీ ఆఫ్ ది స్పై కూడా సోనీలివ్‌లోనే స్ట్రీమింగ్ అవుతోంది.