Health Tips with Fruits : మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే సీజనల్ ఫ్రూట్స్ తినాలని సూచిస్తారు. రోజూ కనీసం ఒకటి, రెండు పండ్లనైనా మనం ఖచ్చితంగా తినాలి. ముఖ్యంగా సమ్మర్ లో పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అయితే వారానికి ఒక్కసారైనా కచ్చితంగా తీసుకోవాల్సిన పండ్లు ఏమిటనేది ఇప్పుడు చూద్దాం..
అరటి పండ్లు:
అరటి పండ్లలో పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అరటి పండ్లు రక్తపోటుని నిర్వహించడంలో సహాయపడుతుంది. కాబట్టి వారంలో ఒక్కసారైనా అరటి పండ్లను తీసుకోవాలి.
నారింజ:
నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నారింజ పండ్లను తీసుకోవడం వల్ల జలుబు, చెవి ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. హైబీపీ సమస్య ఉన్నవారు రోజూ నారింజ పండ్లను తినాలి. నారింజ పండ్లు కూడా ఇమ్యూనిటీని ఇవి పెంచుతాయి.
పుచ్చకాయ:
ఇందులో నీరు శాతం అధికంగా నీరే ఉంటుంది. సమ్మర్ లో పుచ్చకాయను తీసుకుంటే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. కండరాలని ఆరోగ్యంగా ఉంచటానికి కూడా పుచ్చకాయ సహాయపడుతుంది. వారంలో ఒక్కసారైనా దీన్ని తినాల్సిందే.
దానిమ్మ:
రొమ్ము క్యాన్సర్ నుండి దూరంగా ఉండేందుకు దానిమ్మ సహాయపడుతుంది. కాబట్టి వారంలో ఒక్కసారైనా దానిమ్మ తీసుకోండి.
Also Read: ఇంట్లో అద్దం ఎక్కడ ఉంచాలో తెలుసా..? ఇలా చేస్తే అదృష్టం కలుగుతుందట..
కివీ:
కివిలో ఫైబర్‌తో అధికంగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్లు A, B6, B12, E, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి బహుళ పోషకాలు కివిని తీసుకోవటం ద్వారా శరీరానికి అందుతాయి. రక్తహీనతను అధిగమించడంలో సహాయపడుతుంది.
జామ:
జామకాయ పండుతున్న కొద్దీ ‘సి’ విటమిన్ శాతం అధికమవుతుంది. కేవలం విటమిన్ సి మాత్రమే కాదు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, కేల్షియమ్, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్ వంటివి ఎక్కువగా ఉంటాయి. జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్ ఇందులో మెండుగా ఉంది.
ఆపిల్:
ఆపిల్ ఆరోగ్యానికి మంచి టానిక్‌లా ఉపయోగపడుతుంది. రోజుకో ఆపిల్ తీసుకుంటే అనారోగ్య సమస్య బారిన పడకుండా ఉంటారు. ఆపిల్‌లోని పీచు పదార్థం పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆపిల్‌లోని విటమిన్ సి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
బ్లూ బెర్రీస్:
మన శరీరం ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురి అవ్వకుండా ఆంటీ ఆక్సిడెంట్లు కాపాడుతాయి. ఆంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా కాపాడటంలో సహాయపడుతాయి.
ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తాయి. అలానే శక్తిని పెంచుతాయి. కాబట్టి పైన చెప్పిన పండ్లన్నిటిని వారానికి ఒక్కసారైనా తీసుకొని ఆరోగ్యంగా ఉండండి.