Watching a Movie Reduces Calories : చాలామంది కేలరీలు కరిగించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానికోసం చేయని వ్యాయామం, డైట్ ఉండవు. కానీ ఎంత చేసినా కూడా క్యాలరీలు మాత్రం కరగవు. ఇప్పుడు ఇది అందరిని వేధిస్తున్నటువంటి సమస్య.. అయితే కూర్చొని హాయిగా కేలరీలు తగ్గించవచ్చు, అది కూడా సినిమా చూస్తూ.. ఇది వినడానికి కాస్త, కాదు చాలా ఆశ్చర్యంగానే ఉంది, కానీ పరిశోధనలో వెళ్లడైనా నిజం ఇది.
వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం వారు ఇటీవల చేసిన అధ్యాయనంలో ఈ విషయం తెలిసింది. ముఖ్యంగా హర్రర్ మూవీలు చూసే అలవాటు ఉంటే ఇంకా మంచిదంటున్నారు పరిశోధకులు. హర్రర్ మూవీ చూసినప్పుడు హృదయ స్పందన రేటు పెరుగుతుందని వారు తెలిపారు. ఈ పరిశోధనలో పాల్గొన్న పదిమంది సినిమా చూస్తున్నప్పుడు హృదయ స్పందన రేటు, జీవక్రియ రేటు పెరిగాయని దాని కారణంగా ఎక్కువ క్యాలరీలు కరిగినట్టు పరిశోధకులు కనుగొన్నారు.
అంతే కాకుండా ఈ పరిశోధనలో 90 నిమిషాలు భయానక చిత్రం చూస్తే 150 కేలరీలు కరిగిపోయినట్టు వారు వెల్లడించారు. అంటే ఇంచుమించు రోజు మనం 30 నిమిషాలు జాగింగ్ చేసే టైం తో ఇది సమానం. అలాగే ఒత్తిడి సమయంలో విడుదల అయ్యే అడ్రినల్ వేగంగా
విడుదలై, ఆకలిని తగ్గించి బెసల్ మెటబాలిక్ రేటును పెంచి అధిక మోతాదులో కేలరీలను తగ్గిస్తుందని డాక్టర్ రిచర్డ్ మాకెంజీ తెలిపారు. అయితే సక్రమమైన ఆహారం తీసుకొని రోజువారి వ్యాయామాలు కచ్చితంగా చేయాల్సిందే అని కూడా పరిశోధకులు తెలుపుతున్నారు. సులభంగా కేలరీలు తగ్గించే పరిశోధనలో భాగంగానే తాము దీనినీ కనిపెట్టామని వారు వెల్లడించారు.