Periods: స్త్రీలలో పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ. పురాతనకాలం నుంచి ఈ రుతుస్రావం గురించి చాలా నమ్మకాలు ఆచారాలు ఉన్నాయి. ఇండియా ఎంత డెవలప్ అవుతున్నా చాలా చోట్ల పీరియడ్స్ వచ్చిన స్త్రీని అపవిత్రంగా చూస్తూనే ఉంటారు. రజస్వాల అయిన స్త్రీలు గుడికి ఎందుకు వెళ్ళకూడదు(What Happens if We Go to Temple During Periods). పూజ ఎందుకు చేయకూడదు అనే శాస్త్రీయ కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రుతుస్రావం సమయంలో ఆలయాలకు, ప్రార్ధన స్థలాలకు వెళ్లడాన్ని హిందూ ధర్మం నిషేధించింది. వంట గదిలోకి వెళ్లకూడదని, నదిలో స్నానం చేయకూడదని కూడా చెబుతూ ఉంటారు. దీనికి మతపరమైన కారణాలు ఏవైనా దీనికి శాస్త్రీయ కారణం హార్మోన్ల మార్పులే, రుతుక్రమం సమయంలో మహిళల శరీరంలో చాలా హార్మోన్లు మారుతూ ఉంటాయి. దీని వలన ఆమెకు చిరాకు కోపం వస్తూ ఉంటుంది. ఆమె మనసు ప్రతికూలతతో నిండిపోయి ఉంటుంది.
Also Read: ఇంట్లో బల్లులు కొట్లాడుకుంటే దేనికి సంకేతమో తెలుసా..!?
నదిలో స్నానం చేసే సమయంలో ఆమె ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందని ఈ నిబంధనను పెట్టారు. ఆలయం అనేది సానుకూలతతో ఉన్న ప్రదేశం కాబట్టి ఆలయానికి వెళ్ళేటప్పుడు మనసు ప్రశాంతతతో నిండి ఉండాలి. కానీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు చిరాకుగా అనిపిస్తే ప్రశాంతంగా అస్సలు ఉండదు.
ఇదే కాకుండా పూర్వకాలంలో ఏదైనా దేవుడిని పూజించేటప్పుడు కీర్తన ముఖ్య మంత్రం పఠించకుండా పూజ పూర్తయ్యేది కాదు. మంత్రాన్ని శ్రద్ధగా పట్టించాలి. ఉచ్చరణలో తప్పులు చేయకూడదు. కానీ రుతుక్రమం సమయంలో ఒక మహిళ నొప్పి ఆలసటతో ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని మంత్రం జపించడం అస్సలు వీలుకాదు. అందుకే స్త్రీలను పూజలు చేయడం నిషేధించారు.