Varahi VijayaYathra in Tanuku : గురువారం రాత్రి తణుకులోని భోగవల్లి బాపయ్య అన్నపూర్ణ కళ్యాణ మండపంలో తణుకు నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీర మహిళలతో సమావేశమయ్యారు పవన్ సమావేశమయ్యారు.. ఏ యువకుడిలో ఏ ప్రతిభ ఉందో.. ఏ నైపుణ్యం దాగి ఉందో మనకు తెలియదు. మన ఇంటి పక్కనే ఉండే యువకుడిలో ఓ ఎలాన్ మస్క్ దాగి ఉండొచ్చు. రోజు మనకు కనిపించే యువకుడి ఆలోచనల్లో ఓ అద్భుతమైన స్టార్టప్ ఆలోచన దాగి ఉండొచ్చు. అలాంటి వారిని వెలికి తీయాలి.
యువశక్తిని వెలిగించాలి. నేనే కనుక వాలంటీర్లు వ్యవస్థను నడిపించి ఉంటే ఖచ్చితంగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి వీధిలోను ఉన్న యువతలో ఎలాంటి శక్తి ఉంది..? వారి ప్రతిభా పాటవాలు, శక్తిసామర్థ్యాలు ఎంత.?. ఏ రంగం అంటే వారికి ఇష్టం..? సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు పరిశీలిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. యువతలో దాగున్న శక్తిని వెలికి తీస్తే అవి దేశానికి ఉపయోగపడతాయి.
జగ్గుభాయ్ కులాలను విభటించి పాలిస్తున్నాడు కదా..! అలా యువతలోని ప్రతిభ, వారి నైపుణ్యం ఆధారంగా విభజిస్తే వారికి మెండుగా ఉపాధి అవకాశాలు, మానవ వనరుల లభ్యతకు ఆంధ్రప్రదేశ్ వాబ్ గా మారుతుంది. యువత సామర్థ్యాన్ని జగ్గుభాయ్ చంపేస్తున్నాడు. వారికి కేవలం రోజువారీ రూ.164.33 పైసలు కూలీ ఇచ్చి, వారిని బావిలో కప్పలుగా మార్చేస్తున్నాడు. తన సొంత అవసరాలకు సంబంధించి పనులకు వినియోగించుకుంటున్నాడు.
జనసేన ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలో నుంచి 500 మంది యువతీ,యువకులను ప్రతి ఏటా అద్భుతమైన స్వయంశక్తి సాధకులుగా తయారుచేస్తాం. వారికి మూలధనంగా రూ. 10 లక్షలు మళ్లీ కట్టాల్సిన అవసరం లేని డబ్బును అందజేస్తాం. వారు పదిమందికి ఉపాధి చూపేలా మార్గం చూపుతాం. అంతేగాని యువతను వాలంటీర్లుగా చేసి, వారిలో ఉన్న శక్తి,సామర్ధ్యాలను తగ్గించాలని మాత్రం చూడను.
జనసేన పార్టీ వాలంటీర్లకు వ్యతిరేకం కాదు. కొంతమంది వాలంటీర్లు చేస్తున్న పనులు ఆమోదయోగ్యంగా లేవు, అర్హులకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి లంచాలు తీసుకుంటున్నారు. అభం,శుభం తెలియని పసిబిడ్డలపై అత్యాచారాలు చేస్తున్నారు. వాలంటీర్లు ప్రభుత్వ అధికారులు కానప్పుడు వ్యక్తిగత సమాచారం వాళ్లకు ఎందుకు ఇవ్వాలి? ఆ సమాచారం ఎక్కడికి వెళ్తుంది? గతంలో వాలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు రాష్ట్రం నడవలేదా?
ప్రజలకు పెన్షన్లు, రేషన్ కార్డులు రాలేదా? వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించింది ప్రజల సేవ చేయాడానికి అని చెప్పినా… అంతిమంగా లక్ష్యం మాత్రం వైసీపీ పార్టీ కోసం పనిచేయడం మాత్రమే. జనసేన పార్టీ స్థాపించింది రాష్ట్రంలో స్పష్టమైన రాజకీయ మార్పు కోసమే. సామాన్యుడికి కూడా రాజకీయాలు అందుబాటులోకి తీసుకురావాలనే పార్టీ పెట్టాను అని పవన్ వెల్లడించారు.