Varahi VijayaYathra : వారాహి విజయయాత్ర తణుకు బహిరంగసభలో పవన్ కళ్యాణ్ జగన్ పై విమర్శల వర్షం కురిపించారు.. పదిమందికి పట్టెడన్నం పెట్టి రైతు తన బాధ చెప్పుకుంటే ఎర్రిపప్ప అంటున్నారు… మొలకలు వచ్చాయని మీ మంత్రుల వద్ద గోడు వెళ్లబోసుకుంటే ఎర్రిపప్పు అని తిడుతున్నారు. కడుపు నింపి రైతును గౌరవించడం వైసీపీకి తెలీదు. మీరు మాత్రం గతంలో ఎన్నడూ లేని చెత్త పేరుతో ఎర్రిపప్పు పన్నులు మాత్రం వేయొచ్చు.
ఇంటి ముందు కంకడ పెట్టుకుంటే టాక్స్.. ఇంటిపై పై ఫ్లోర్ వేసుకోవాలంటే మున్సిపాలిటీతో పాటు స్థానిక ఎర్రిపప్ప నాయకులకు టాక్స్.. గట్టిగా అడిగితే సంక్షేమం నిలిపిస్తామని పప్పులతో బెదిరింపులు, ఇలా జగన్ ఎర్లపప్పు పన్నులు వేస్తూ, ఎర్రిపప్ప ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడని పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేసారు. వైసీపీ నాయకులు ఎవర్ని ఎన్ని మాటలైనా అనవచ్చు.
వారికి తాడేపల్లి ప్రచురణలు పేరుతో ప్రత్యేక తెలుగు నిఘంటువు ఉంది. అక్కడ వారి ఇష్టం ప్రకారం ఎవర్ని తిట్టినా మళ్లీ దాన్ని వారే సరిచేసుకొనీ కొత్త అర్ధాలు చెబుతారు. రైతుల్ని బూతులు తిట్టి, తాడేపల్లి నిఘంటువులో బుజ్జినాన్న అని కొత్త అర్ధం తెచ్చారు కదా..? అందుకే మేం కూడా వైసీపీ ప్రభుత్వాన్ని మీ పరిభాషలోనే ఎర్రిపప్పు ప్రభుత్వంగానే పిలుస్తాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు 219 హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి.
రామతీర్ధంలో శ్రీరాముని విగ్రహానికి శిరచ్ఛేదనం చేశారు. అంతర్వేదిలో రథం దగ్ధం చేశారు. ఇప్పటి వరకు ఒక్క నిందితుడిని కూడా ఈ ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు అన్నవరంలో అర్చకులను వేలం పెట్టాడు ఈ పెద్దమనిషి. దేవాలయ ఆవరణలో ఉన్న దుకాణాలు, ప్రసాదాల తయారీ, కళ్యాణ కట్ట వంటి వాటిని వేలం వేయవచ్చు తప్ప అర్చకులను వేలం వేయకూడదని ఏపీ ఎండోమెంట్ యాక్ట్ చెబుతోంది. జగన్ ఇందుకు విరుద్ధంగా హిందు దేవాలయాలపై ఎందుకు పడ్డాడు?
అర్చకులను ఎందుకు వేలం వేస్తున్నాడు. ఇతర మతాల్లో మత ధర్మం బోధించేవారిని అలా వేలం వేయగలరా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? రాజ్యాంగ పీఠికలోనే రాజ్యం ఎప్పుడు మఠానికి సంబందించిన అంశాల్లో తలదూర్చకూడదని స్పష్టంగా చెప్పారు కదా. దీనిపై జనసేన న్యాయపరమైన పోరాటం చేస్తుంది. కొంతమంది వైసీపీ ప్రజాప్రతినిధులు హిందు ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు. దేవాదాయ శాఖకు సంబందించిన ఆస్తులు అన్యాకారం కాకుండా చూడాల్సిన వారే, వాటిని మింగేస్తున్నారు అన్నారు.