Varahi VijayaYathra : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజల సమాచారం ఎందుకు పక్క రాష్ట్రం హైదరాబాద్ లోని నానక్ రాంగూడ ప్రాంతంలో ఉన్న “ఎపీఏ” అనే ఏజెన్సీ వద్ద ఉంది..? ప్రజల డేటాను సేకరించి అక్కడకు ఎందుకు పంపిస్తున్నారు..? సమాధానం చెప్పాలి జగన్..? అంటూ పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆ ఏజెన్సీలో పనిచేస్తున్న 700 మంది సిబ్బంది ప్రజల డేటాతో ఏం చేస్తున్నారు..?
అసలు వారికి జీతాలు ఇస్తుంది ఎవరు..? దాని నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు..? అసలు అక్కడకు ప్రజల డేటాను పంపి మీరు ఏం చేయదల్చుకున్నారు..? జగన్ వింటున్నావా.. సమాదానం చెప్పు? అని ఆయన అన్నారు. 1859లో మొదలు పెట్టి, ప్రపంచమంతా విస్తరించిన సామాజిక సేవా సంస్థ రెడ్ క్రాస్ లాంటి వాలంటీరు సంస్థకి భారతదేశ చాప్టర్ కు భారత రాష్ట్రపతి, రాష్ట్రాలకు గవర్నర్లు బాధ్యత తీసుకుంటారు. మరి నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాధనం ఖర్చు చేసి మరీ పని చేయిస్తున్న వాలంటీర్లపై ఎవరు బాధ్యత తీసుకుంటారు..?
అసలు ఈ వ్యవస్థకు అధిపతి ఎవరు..? కొందరు వాలంటీర్లు చేస్తున్న అసాంఘిక పనులు, నేరాలకు నువ్వు బాధ్యత తీసుకుంటావా లేదా..? ప్రజలకు వివరించు జగన్..? రాజకీయ కారణాలతో 26 మంది లో దక్కాల్సిన సంక్షేమ విధులను వాలంటీర్లు.. తొలగిస్తే వారు న్యాయం చేయాలని గొడవ చేసి హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బట్టు దేవానంద్ గారు వాండ్డు ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిగత సమాచారం తీసుకునే లీగల్ అథారిటీ ఎక్కడిది? ఎవరిచ్చారు. ఇంతమంది ప్రభుత్వ అధికారులు ఉండగా, వీళ్ళు ఎందుకు సమాచారాన్ని సేకరిస్తున్నారు?
వ్యక్తిగత డేటా చోరీ అయితే బాధ్యత ఎవరు వహిస్తారు? అని గౌరవ ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సమాధానం ఎక్కడ జగన్..? వ్యక్తిగత డేటా చోరీ అయితే ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహిస్తాడా? 15 నుండి ఎమ్మెల్యేలు వహిస్తారా? లేకపోతే 30 మంది ఎంపీలు వహిస్తారా? అని ప్రశ్నించిన గౌరవ కోర్టుకు ,ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం ప్రజలకు చెప్పు జగన్.. అని పవన్ ప్రశ్నించారు. ఈ సమాచారం మహిళల భద్రతకు కీడు చేస్తుందని పవన్ వివరించారు.
కొందరు వాలంటీర్ల తీరు ఎలా ఉంది అంటే… మా జగనన్న 16 నెలలు జైలులో గడిపాడు. మేం కూడా అవసరం అయితే జైలుకు పోతాం అంటున్నారు. ఇది జగన్ యువతకు ఇచ్చిన వారసత్వ సంపద. ప్రజలంతా వాలంటీర్లు ఏదో చేసేస్తారు.పధకాలు ఆగిపోతాయి అనుకోకండి. ఎవరైనా వాలంటీరు దైర్యంగా ముందుకు రండి, పోలీసులకు, కలెక్టర్ కు పిర్యాదు చేయండి. మీ వెనుక జనసేన పార్టీ ఉంటుందని పవన్ వెల్లడించారు.