• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Janasena News

Varahi VijayaYathra : తాడేపల్లిగూడెంలో గర్జించిన జన సైన్యం..

Rama by Rama
July 13, 2023
in Janasena News
0 0
0
Varahi VijayaYathra : తాడేపల్లిగూడెంలో గర్జించిన జన సైన్యం..
Spread the love

Varahi VijayaYathra : జయహో జనసేనాని అంటూ తాడేపల్లిగూడెం ప్రజానీకం ఎలుగెత్తారు.. వారాహి విజయ యాత్రకు ప్రతి అడుగునా బ్రహ్మరథం పట్టారు. వేల సంఖ్యలో ద్విచక్రవాహనాలు అనుసరించగా ఆడపడుచుల హారతులు.. గజమాలల సత్కారాలు.. అభిమానుల హర్షాతిరేకాల మధ్య పవన్ కళ్యాణ్ గారు పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు. జన సైనికులు, వీరమహిళలు విజయనాదంతో గర్జించగా., జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎస్వీఆర్ సర్కిల్ నుంచి సమరనాదం చేశారు. 

వారాహి రథం అధిరోహించి జనసేనాని చేసే ప్రసంగం వినేందుకు తాడేపల్లిగూడెం పట్టణ వాసులంతా ఎస్వీఆర్ సర్కిల్ కి చేరుకున్నారా అనిపించేంతగా ఆ కూడలి కిక్కిరిసింది. పవన్ కళ్యాణ్ గారి ర్యాలీతో అలంపురం నుంచి ఎస్వీఆర్ సర్కిల్ లోని వారాహి విజయ యాత్ర సభా ప్రాంగణం వరకు జనం రోడ్ల మీద బారులు తీరి జనసేనానికి ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో సాగిన తాడేపల్లిగూడెం తణుకు జాతీయ రహదారి, పట్టణంలోని మెయిన్ సెంటర్ మొత్తం జనసంద్రంగా మారింది. 

యాత్ర ఆద్యంతం పండుగ వాతావరణం మధ్య సాగింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు అలంపురం నుంచి సభకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ గారికి సభ విజయాన్ని కాంక్షిస్తూ ఆడపడుచులు హారతులు పట్టారు. అక్కడి నుంచి వేలాది ద్విచక్రవాహనాలు అనుసరించగా జనసేన శ్రేణుల కేరింతల మధ్య ముందుకు కదిలారు. అలంపురం జంక్షన్, జువ్వలపాలెం బస్టాండ్,తాడేపల్లిగూడెం వంతెన, మెయిన్ సెంటర్లలో భారీ జనసమూహాలు జనసేనానిపై పూల వర్షం కురిపించాయి. 

తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరినీ ఉత్సాహపరుస్తూ, అభివాదం చేస్తూ,ఆడపడుచులు, జనసైనికులకు కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. జువ్వలపాలెం బస్టాండ్ సెంటర్ వద్ద భారీ గజమాలతో పార్టీ శ్రేణులు సత్కరించారు. వారాహి విజయ యాత్ర సభతో తాడేపల్లిగూడెం పట్టణం మొత్తం జనసేన జెండాలు రెపరెపలాడాయి. స్వాగత హోర్డింగులు, బ్యానర్లతో పట్టణం మొత్తం నిండిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ బస చేసిన ప్రాంతం నుంచి ఎస్.వి.ఆర్ సర్కిల్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి జనసేన శ్రేణులు బ్యానర్లు కట్టారు.

ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడిస్తామని చెప్పకనే చెప్పారు. సేనాధిపతిగా మీరు ముందుండండి.. సైన్యంగా మేము మీ వెనుక నడుస్తామంటూ యువత పెద్ద ఎత్తున బ్యానర్లు ప్రదర్శించారు. ఎలుగెత్తు.. ఎదురించు… ఎన్నుకో.. నినాదం జనసేన శ్రేణులు చేతబూనిన ప్రతి బ్యానర్లో కనబడింది. ఆడబిడ్డల మాన ,ప్రాణ రక్షణ జనసేనతోనే సాధ్యం.. హల్లో ఏపీ.. బైబై వైసీపీ నినాదాలు ప్రచురించిన ఫ్లకార్డులు వారాహి యాత్ర సభ ఆధ్యంతం దర్శనమిచ్చాయి.. బైబై వైసీపీ… వెల్కమ్ జనసేన…

వారాహి యాత్ర సభా ప్రాంగణానికి చేరుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆడపడుచుల గ్యాలరీ వద్దకు వెళ్లి సభకు వచ్చిన ప్రతి వీర మహిళకు ప్రత్యేకంగా అభివాదం చేశారు. వారాహి విజయయాత్ర సభ నిర్వహించిన ఎస్వీఆర్ సర్కిల్ ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. ర్యాలీ, సభా ప్రాంగణ పరిసరాల్లో ఉన్న భవంతులు, వాహనాలు కూడా.. వారాహి యాత్రకు వచ్చిన జనం ఆక్రమించేశారు. సభకు నలువైపులా ఎటుచూసినా కనుచూపుమేర జనప్రవాహం. కేరింతలు కనబడ్డాయి. సభకు వచ్చిన ప్రజలు ఇబ్బంది పడకుండా  పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం వినేందుకు వీలుగా ఎస్వీఆర్ సర్కిల్ పరిసరాల్లో భారీ ఎల్డీలు ఏర్పాటు చేశారు.

 

 


Spread the love
Tags: AP NewsChandrababuNaiduJanaSainikJanasenaJanasena veera mahilaluNadendla ManoharNadendla Manohar about Varahi YatraNagababuPawan Kalyan Varahi Yatra in RajoluPawanKalyanTdpVarahi VijayaYathraVarahi VijayaYathra in EluruVarahi VijayaYathra in MummadivaramVarahi VijayaYathra in TadepalligudemVarahi Yathra in MalikipuramYCPYSJagan
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.