అభిమానులకు తియ్యని కబురు చెప్పారు విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ. అభిమానులు ముద్దుగా విరుష్క అని పిలుచుకునే ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు.
2021 జనవరిలో మేము ముగ్గురం కాబోతున్నాం అంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. చాలాకాలం ప్రేమించుకుని 2017 లో వివాహం ద్వారా ఒక్కటైన విషయం అందరికీ తెలిసిందే.
ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయం తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు వరుణ్ ధవన్, ప్రియాంక చోప్రా,ఆలియా భట్ మరియు క్రికెట్ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా ఈ జంట కి విషెస్ తెలిపారు.
And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 pic.twitter.com/iWANZ4cPdD
— Anushka Sharma (@AnushkaSharma) August 27, 2020