సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన నియోజకవర్గ పరిధిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ సమర్పించినది సొంత పార్టీ కార్యకర్తలే కావడం విశేషం. రాజుపాలెం గ్రామం, కొండ నెమలిపురం దగ్గర ఈ అక్రమ మైనింగ్ జరిగినట్లుగా రాజుపాలెం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఉన్నత స్థాయిలో సీబీఐ విచారణ జరిపించాలని వ్యాజ్యం లో వారు కోర్టును కోరారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దీనిపై సమగ్ర వివరాలు వెంటనే సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాది ఆదేశించి కేసును వాయిదా వేసింది.
