కరోనా భారిన పడిన ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు ఆదిరాజుని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్సు సకాలంలో రాలేదని, వెంటిలెటర్ సదుపాయం అందకపోవడం వలనే ఆయన ప్రాణాలు కోల్పోయారని శైలజానాథ్ AP ముఖ్యమంత్రి జగన్ కి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు సకాలంలో అంబులెన్సులు చేరుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని, కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే రాష్ట్రంలో ఉన్న అన్ని స్టార్ హోటల్స్ ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని బాధితులకు సౌకర్యాలు కల్పించాలని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.
