ఫేక్ ప్రామిస్ లను, అబద్ధాలను ప్రచారం చేయడంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సిద్ధహస్తులని నారా లోకేష్ విమర్శించారు. కరోనాతో మరణించిన తండ్రి అంత్యక్రియలకు అంబులెన్స్ వాళ్ళు 85 వేల రూపాయలు వసూలు చేశారంటూ ఒక ఎన్నారై షేర్ చేసిన వీడియోని తన ట్విట్టర్ ఖాతా లో పోస్ట్ చేసి నారా లోకేష్ ఏపీ సీఎం పై విమర్శలు చేశారు. కోవిడ్ దహన సంస్కారాలకు 15000 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వ వాగ్దానం ఏమైందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.
అయితే సంఘటన ఎక్కడ జరిగింది? డబ్బులు వసూలు చేసిన అంబులెన్స్ ప్రైవేటుదా? లేక 108 అనేది బాధితుడు ఎక్కడా వీడియో లో పేర్కొనలేదు.
This is horrible! Rs. 85k was extorted by ambulance staff from this Melbourne-based NRI who lost his father in Kurnool. What happened to Rs.15k promised by Govt for Covid cremation? Seems like @ysjagan is only good at spreading fake promises & lies. pic.twitter.com/t7yy3j1X0O
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 21, 2020
