రాజధాని దుమారం ఇంకా రాష్టవ్య్రాప్తంగా కొనగుతూనే ఉంది. వైసీపీ టీడీపీ ఆరోపణ ప్రత్యారోపణల మధ్య రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో రాజకీయ నాయకుల మధ్య ఈ రచ్చ మరింత ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా అయ్యన్నపాత్రుడు కామెంట్స్ మరింత సంచలనం సృష్టించాయి.
విశాఖపట్నం రాజధానిగా మారితే దోపిడీ దారులు మొత్తం జిల్లాపై కన్నేశారని ఇక్కడ భూములు సహజవనరుల దోపిడీకే వారు చూస్తున్నారు అనీ ఆయన మీడియాతో చెప్పారు. అడ్డపంచె బ్యాచ్ నగరంలో దిగుతున్నారనీ వారిని కట్టడి చెయ్యడం ఇక సాధ్యం కాదనీ విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ ఆయన హెచ్చరించారు.
అయ్యన్నపాత్రుడు కామెంట్స్ పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయాల్లో ఒక ప్రాంత సంస్కృతి ని కించపరిచేలా మాట్లాడం సమంజసం కాదనీ, అయ్యన్న తన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలనీ డిమాండ్ చేస్తున్నారు.