కెప్టెన్ అమెరికా సివిల్ వార్, బ్లాక్ పాంథర్ చిత్రాల అమెరికన్ నటుడు చాడ్విక్ బోస్ మెన్ (43) ఈరోజు ఉదయం కన్నుమూసారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నటుడు, నిర్మాత అయిన చాడ్ విక్ 2016 నుండి కోలన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. కానీ ఆ విషయాన్ని ఎక్కడా ఆయన వెల్లడించలేదు. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ , అవెంజర్స్ ఎండ్ గేమ్ తదితర చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన చివరగా నటించిన చిత్రం DA5 bloods గత జూన్ నెలలో Net flix ఓటీటీ వేదికగా విడుదలైంది.