మూడు నేషనల్ అవార్డులు, పద్మశ్రీ పురస్కారం పొందిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత చెలరేగిన ఆరోపణల పర్వం ఇంకా చల్లారలేదు. ఆ కేసు విచారణ లో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. సుశాంత్ సింగ్ మరణం వెనుక గల కారణాలపై జరుగుతున్న విచారణలో అతడు స్నేహితురాలు రియా హస్తం ఉందని ఆమె మాదక ద్రవ్యాలు తీసుకునేదని పనిమనిషి ఇచ్చిన వాంగ్మూలం.. ఆ తర్వాత రియా కు మాదకద్రవ్యాలకు అలవాటు లేదనీ, కోర్టు ఆదేశిస్తే ఎప్పుడైనా పరీక్షలకు సిద్ధం అని ఆమె తరపు న్యాయవాది ప్రకటించడం జరిగింది.
అయితే నిన్న కంగన చేసిన ట్వీట్ అందరినీ ఆలోచనలో పడేసాయి. బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వినియోగం సర్వసాధారణమని, దానికి నేనే ప్రత్యక్ష సాక్షినని, ఈ విషయంలో విచారణ చేస్తున్న బృందానికి తన పూర్తి సహకారాలు ఉంటాయని ట్వీట్ చేయడం సంచలనం కలిగించింది. ఆమె చేసిన ట్వీట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విచారణలో ఆమె వెల్లడించే ఆ ప్రముఖ వ్యక్తులు ఎవరు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారు అనేది విచారణలో తెలాల్సి ఉంది.
