వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఆసక్తికర అంశాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. తాను ఫోటో తీసిన మొదటి కెమెరా, ఆ కెమెరాతో తీసిన మొదటి ఫోటో ఇది అంటూ 2 ఫోటోలను ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. రెండవ ఫోటోలో ఉన్న ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు అంటూ పవన్ కళ్యాణ్ చిన్నప్పటి ఫోటో ని అభిమానులకు అందించారు.