సెలబ్రిటీల కుటుంబాలు అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ, వారు సమాజానికి ఏం చేస్తున్నారు.. వారి వల్ల ఎవరికైనా మేలు జరుగుతుందా ? అనేది తరచూ అందరు గమనిస్తూ ఉంటారు. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అదృష్టవంతులు అని చెప్పాలి. చిరంజీవి కుటుంబంలో అందరికీ ప్రత్యేక గుర్తింపు ఉన్నా.. ఈమధ్య ప్రత్యేకించి ఆయన కోడలు ఉపాసన కొణిదెలపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. రామ్ చరణ్ భార్య ఉపాసన చిరంజీవి కుటుంబానికి మరింత వన్నెతెచ్చే కార్యక్రమాలు చేపట్టడం మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెగా కుటుంబం నుంచి ఏ చిన్న కార్యక్రమం చేసినా మీడియాలో ఒక లెవల్ లో హైప్ ఉంటుంది. రామ్ చరణ్ భార్య ఉపాసన సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించే ప్రకటనల్లో నటిస్తూ జనాల్లో చైతన్యం నింపుతున్నారు.
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరిగే కార్యక్రమాల్లోనే కాకుండా ప్లాస్మా డోనేషన్ పై చిరంజీవిగారు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలను రూపొంచడంలో సైతం ఉపాసన తన వంతు సహకారం అందిస్తున్నారు. సంపన్న కుటుంబం నుంచి వచ్చినా సమాజానికి ఉపయోగపడే ఏ పని అయినా సరే ముందుకొచ్చి ప్రజల్లో చైతన్యం నింపడానికి ఈ మెగా కుటుంబానికి చెందిన కోడలు మిగిలిన వారికి ఆదర్శంగా వుంటున్నారు
ఉపాసన కొణిదెల లాంటి కోడలు దొరకటం చిరంజీవి అదృష్టమని ఆమెని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
