తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో బూరుగుపూడి వద్ద ముంపుకు గురైన ఆవ భూములను నిన్న బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు భాజపా నేతలతో కలిసి పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భూముల వ్యవహారం అతిపెద్ద కుంభకోణం అని, ఎకరా 7 లక్షల విలువచేసే భూమికి 45 లక్షలు పరిహారం ఇవ్వడం వెనుక ఎవరి హస్తం దాగుందో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
భూములకు ఇచ్చిన పరిహారాన్ని వెనక్కి తీసుకోవాలని 580 ఎకరాల్లో 400 ఎకరాలు ఒకరి దగ్గర ఉండడం వెనుక ఉద్దేశం వచ్చిన పరిహారాన్ని పంచుకునేందుకే అని ఆయన దుయ్యబట్టారు. ఈ భూముల వ్యవహారంలో డబ్బులు పంచుకునేందుకు జలవనరుల శాఖ భూములు నివాస యోగ్యం కాదని ఇచ్చిన నివేదికను సైతం పక్కన పెట్టారని, తక్షణమే ఇచ్చిన పరిహారాన్ని వెనక్కి తీసుకోవాలని దీనిపై భాజపా పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు.