ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 88 మంది మరణించగా, కొత్తగా మరో ఎనిమిది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ 2,89,829 కేసులతో దేశంలోనే మూడో స్థానంలో ఉంది. కాగా గత 24 గంటల్లో 10,117 మంది కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.