విజయవాడ స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాద ఘటనలో కీలక నిందితుడు డాక్టర్ రమేష్ కుమార్ పై విజయవాడ పోలీసులు ప్రకటించిన లక్ష రూపాయల రివార్డు సరికాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. కరోనా పై పోరాటంలో ముందుండి సేవ చేస్తున్న డాక్టర్లపై ఇలా ప్రవర్తించడం వల్ల వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని IMA అభిప్రాయపడింది.
డాక్టర్ రమేష్ సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసే టెర్రరిస్టో లేదా మావోయిస్టో కాదని, అలాంటప్పుడు అతనిపై రివార్డు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా స్వర్ణా ప్యాలెస్ ఘటనలో డాక్టర్ రమేష్ కుమార్ కి కోర్టులో ఉరట లభించింది.
హైకోర్టు ఈ కేసులో తదుపరి విచారణ పై స్టే విధించింది. రమేశ్ ఆస్పత్రి ఎండీ, ఛైర్మన్ ల విషయంలో తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ ఐ ఆర్ పై స్టే విధించింది.