ప్రపంచాన్ని వణికిస్తున్న covid 19 మహమ్మారికి అధికారికంగా తొలి వ్యాక్సిన్ రష్యా ఈ రోజు విడుదల చేసింది. రష్యా అధ్యక్షుడు వాద్లమిర్ పుతిన్ కుమార్తెలకు తొలి టీకాలు వేసి ప్రపంచానికి వ్యాక్సిన్ ని పరిచయం చేసిన తొలి దేశంగా చరిత్రకెక్కింది. వ్యాక్సిన్ విడుదలైన గంటల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు వ్యాక్సిన్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టాయి. ఏదేమైనా ఈ శతాబ్దంలోనే అతి పెద్ద మహమ్మారిగా అవతరించిన కోవిడ్ 19 కి వ్యాక్సిన్ రావడం శుభపరిణామం.
కాకపోతే దేశాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఈ వైరస్ లోని మార్పులు రావడం పరిశోధకులు గమనించారు. అలా ఎప్పటికప్పుడు తనకు తాను భిన్న రూపాల్లో మారిపోతున్న ఈ మహమ్మారిపై ఈ వ్యాక్సిన్ ఎంత వరకు పనిచేస్తుంది అనేది తెలియాలి. వ్యాక్సిన్ విడుదల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.