ఏపీ మంత్రి కొడాలి నాని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి తిట్ల పురాణం అందుకున్నారు. చంద్రబాబు బ్రతుకంతా చిల్లర రాజకీయమే.. ఎవరెవరిని అడ్డుపెట్టుకొని ఈ స్థాయికి వచ్చాడో నాకు చిన్నప్పటి నుండి తెలుసంటూ ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.
నిన్న గుడివాడలో పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతి లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు.
చంద్రబాబు గురించి ఎవరైనా విమర్శలు చేస్తే సోషల్ మీడియాలో తన చుట్టూ ఉండే పిచ్చి కుక్కలు, ఊర కుక్కలను పంపుతాడు. అంతేకాక ఆయన చుట్టూ వర్ల రామయ్య లాంటి పని లేని పనికిమాలిన వాళ్ళు పది మంది ఉంటారు, తన అనుకూల మీడియా ఛానల్స్ లో అడ్డమైన నా కొడుకుల్ని పెట్టి మమ్మల్ని బూతులు తిట్టిస్తాడు. ఇలాంటి చిల్లర పనులే చంద్రబాబు చేస్తూ ఉంటాడు. చంద్రబాబు లాంటి లుచ్చా చేసే కార్యక్రమాలు ఏంటో మాకు తెలుసు, బజార్లో రాత్రిపూట వ్యాపారం చేసుకునే వాళ్లను తీసుకొచ్చి సోషల్ మీడియాలో మా పై ఉసిగొల్పుతాడు అంటూ తీవ్రస్థాయిలో దూషణలకు దిగారు.
పదవి కోసం చంద్రబాబు ఎలాంటి నీచమైన పనులకు దిగజారుతాడో, రెండు ఎకరాల స్థాయి నుండి రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించాడో ఎంత అవినీతి చేసి ఈ స్థాయికి వచ్చాడో నిరూపించి రాష్ట్ర ప్రజల ముందు మేము దోషిగా నిలబెడతాం. చంద్రబాబు ఎంత నీచుడో.. నికృష్టుడో ప్రజలందరికీ తెలియజేస్తాను. చంద్రబాబు నా వెంట్రుక, బొచ్చు కూడా పీకలేడు. ఇలాంటి ఊర కుక్కలని పెట్టుకొని దిక్కున్న చోట చెప్పుకోమని తిట్ల పురాణం అందుకున్నారు.
రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. కానీ, ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా పరుష పదజాలంతో దూషించడం ఎంతవరకు సమంజసం అనేది ఆయనకే తెలియాలి.