ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన మంత్రి కొడాలి నాని దూకుడుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .
కానీ నానీ దూకుడు వెనుక అర్ధమేంటని పరిశీలించగా ఆయనకున్న ముక్కుసూటిగా మాట్లాడే వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న నానీ టీడీపీ హయాంలో ఎదుర్కొన్న ఇబ్బందులు కొంత కారణంగా పేర్కొంటున్నారు.
ప్రభుత్వానికి సంబంధించిన ఏ విమర్శలుని అయినా సూటిగా తిప్పికొట్టే ఆయన శైలికి పార్టీలో చాలామంది అభిమానులు ఉండటం ఒక కారణం.
ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ పై ఆయన చేసిన విమర్శలు మీడియాలో సంచలనంగా మారుతున్నాయి
నానీ వ్యవహార శైలి పై కొంతమేర విమర్శలు వున్నా, ఆయన ఉపయోగించే పదజాలంతో కొంతమంది ఏకీభవించకపోయినా కొన్ని సందర్భాల్లో ఆయనే కరెక్ట్ అని వైసీపీలో చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా కొడాలి ఏ కామెంట్స్ చేసినా మీడియాలో అవి హల్ చల్ చేస్తూ నానీ క్రేజ్ ని మరింత పెంచాయని చెప్పకతప్పదు