తెలంగాణలో ప్రభుత్వానికీ, గవర్నర్ కు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, దీనిపై ముఖ్యమంత్రికి లేఖ రాసినా పట్టించుకోలేదని గవర్నర్ వాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై హుజూర్ నగర్ శాసనసభ్యులు సైదిరెడ్డి స్పందిస్తూ.. కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, ఈ విషయం గవర్నర్ తెలుసుకోవాలని హితవు పలికారు. గ్రామ స్థాయిలో కూడా ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహిస్తుందని, గవర్నర్ తమిళ సై తెలంగాణ బిజెపి అధ్యక్షురాలిలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.