తిరుమలలో అన్యమతస్తులకు డిక్లరేషన్ వివాదం రోజురోజుకీ దుమారం రేపుతుంది. అన్య మతస్తులు తిరుమలకి ప్రవేశించినప్పుడు డిక్లరేషన్ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర మంత్రి కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అసలు ఈ వివాదం రావడానికి గల కారణం చంద్రబాబు అని, అన్యాయంగా మామను చంపిన వ్యక్తి, కుటుంబ విలువలు తెలియని లుచ్చా చంద్రబాబు ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని తాజాగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మండిపడ్డారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులకు చనిపోతే తల కొరివి పెట్టలేదు, తల నీలాలు తీయని చంద్రబాబు ఈ రోజున హిందూ మతం అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే ఇలాంటి వివాదాలు చేస్తున్నాడని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు ఇంకొకసారి ముఖ్యమంత్రి జగన్ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తిరుమల ఆలయంలో ప్రవేశం చేయాలని వ్యాఖ్యలు చేస్తే వై ఎస్ ఆర్ సి పి పార్టీ తరఫున చంద్రబాబుకి దేహ శుద్ధి చేయడం ఖాయం, అందులో నేను ముందు ఉంటానని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.