అమరావతిని రాజధాని వికేంద్రీకరణ పేరుతో తరలించడం ఈ రాష్ట్రానికి తీరని నష్టమని చంద్రబాబు నిప్పులు చెరగడం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో విశాఖపట్నంలో రాజధానికి సన్నాహాలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
నిజానికి తెలుగుదేశం పార్టీ వ్యూహంలో భాగంగా మొదట శాశన సభ్యులు తర్వాత పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేద్దామంటూ పార్టీలో చర్చ జరిగినట్లు చెబుతున్నారు.మొదట అధికార పక్షం పై సవాల్ విసిరిన టీడీపీ ఎందుకో మళ్ళీ వెనక్కి తగ్గినట్లు అనిపిస్తుంది
ఇప్పుడు ఎన్నికలకు వెళితే అధికార పక్షం వత్తిడి వల్ల ఓటమి పాలైతే అది అమరావతి కి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు అని వైసీపీ ప్రచారం చేసే అవకాశం ఉందని,ప్రస్తుతానికి సంయమనం పాటించడం,ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం పైనే దృష్టి పెట్టాలని నిర్ణయం తీసున్నట్టు తెలుస్తోంది.