కరోనా నేపథ్యంలో ఇప్పుడప్పుడే థియేటర్లు తెరిచే పరిస్థితి లేదు. ఇప్పుడంతా ఓటీటీలదే హవా. ప్రేక్షకుల ఇంటివద్దకే వినోదం చేరేలా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పోటీపడుతున్నాయి. 100% తెలుగు వినోదం అంటూ అల్లు అరవింద్ మొదలుపెట్టిన ఆహా యాప్ మొదట్లో కాస్త చప్పగానే సాగింది. మిగిలిన ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుండి వస్తున్న పోటీతో ఒక్కసారిగా దూకుడు పెంచింది. వరుస వెబ్ సిరీస్ లు, కృష్ణ అండ్ హిస్ లీల, ట్రాన్స్, ఇప్పుడు జోహర్ లాంటి మంచి చిత్రాల విడుదలతో పోటీలోకి శరవేగంగా దూసుకు వచ్చింది.
ఇప్పుడు అదే ఊపులో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య పాత్రలో 44 ఎపిసోడ్లు నిడివి కలిగిన వెబ్ సిరీస్ నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఇదివరకు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై తన ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నిజంగా ఈ వార్త ఆయన అభిమానులకు పండగ లాంటిది. అల్లు అరవింద్ ఆలోచన ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో, అభిమానులను ఏమేరకు అలరిస్తుందో వేచి చూడాలి.