రాజధాని మాస్టర్ ప్లాన్ గృహ నిర్మాణ జోన్ లో మార్పులపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను గతంలో హైకోర్టు సస్పెండ్ చేసింది.
దీనిపై సుప్రీం కోర్టులో ఏపీ సర్కారు 5 పిటిషన్లు దాఖలు చేయగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి సీజేఐ బోబ్డే నేతృత్వంలో ధర్మాశనం విచారణ జరిపారు.
నేడు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన 5 పిటిషన్లను కొట్టి వేస్తూ, హైకోర్టులో ప్రాథమిక విచారణ సరైన రీతిలోనే జరిగిందని ఈ విషయంపై ప్రభుత్వం హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించింది.
కోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను కోర్టులు తప్పు పడుతూనే ఉన్నాయి. మరి ప్రభుత్వం ఆ తప్పులను సరి చేసుకుంటుందా లేక మొండిగా ముందుకు వెళుతుందా అనేది వేచి చూడాలి.
