చిత్తూరు జిల్లాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరయ్యారు.
దీనిపై జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ కూసంపూడి స్పందిస్తూ.. జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగురవేయడం, లేదా అలా ఎగురవేసిన జెండాను ప్రచురించడం.. జాతీయ పతాక గౌరవ పరిరక్షణ చట్టం 1971 ప్రకారం శిక్షార్హమైన నేరం. కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి గారికి, ఎంపీ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఈ వార్త ప్రచురించిన పత్రిక ఎడిటర్ గారికీ తెలియదా అంటూ ప్రశ్నించారు. దానితో పాటుగా, ఆ వార్తను ప్రచురించిన వార్తాపత్రిక ప్రతిని మీడియాకు అందించారు. తక్షణమే అధికారులు స్పందించి బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.