తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి ఎలాంటి పొత్తులు లేకుండా సింగల్ గా పోటీ చేసి గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై 21 సీట్లకు పరిమితమైంది. ఆ పార్టీ నుండి గెలిచిన వారిలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పక్షం లో చేరగా మిగిలిన వారు సగం మందికి పైగా పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు ఒకవైపు, ఆ పార్టీ నేతలు గతంలో చేసిన అవకతవకలను బయటకు తీస్తూ అన్ని వైపుల నుండి కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అధికారపక్షం మరోవైపు, 70 నుండి 80 వ పడిలోకి అడుగు పెడుతున్న చంద్రబాబు తర్వాత సమర్థ నాయకత్వం వహించే నేత ఎవరు అని కార్యకర్తలు చర్చించుకుంటున్న ఈ సమయంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని నియమించ బోతున్నట్లుగా తెలిసింది.
ఇటీవల ఈఎస్ఐ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొన్న అచ్చెన్నాయుడుని త్వరలో నిర్వహించబోయే రాష్ట్ర కమిటీ
అధ్యక్షునిగా ప్రకటించనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఇన్చార్జి నియమించి 25 పార్లమెంట్ నియోజకవర్గాలను 25 యూనిట్లుగా విభజించ బోతున్నారు. అచ్చం నాయుడు టిడిపిని ఎంత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తారు అనేది చూడాలి.